Friday, March 21, 2025

పోసాని కృష్ణమురళీకి ఊరట.. బెయిల్ మంజూరు

- Advertisement -
- Advertisement -

అమరావతి: చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్‌కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సినీ నటుడు పోసాని కృష్ణమురళీపై నమోదైన కేసులో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయనకు బెయిల్ మంజూరైంది. పోసాని బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన గుంటూరు సిఐడి కోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా జైల్లో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. అయితే సిఐడి అధికారులు మరోసారి పోసానికి కస్టడీలోకి తీసుకొనే ప్రయత్నం చేశారు. కానీ, ఈలోపే కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News