Monday, April 28, 2025

పోసానికి మరోసారి ఊరట.. బెయిల్ మంజూరు

- Advertisement -
- Advertisement -

కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్‌కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నటుడు పోసాని కృష్ణమురళిపై ఎపిలోని పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన్ను రాయచోటి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోసానికి మరోసారి ఊరట లభించింది. శుక్రవారం ఆయనకు బెయిల్ మంజూరు అయింది. ఓబులవారి పల్లె పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో ఆయనకు కడప మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోసాని తరఫున మాజీ ఎజి పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించారు. పొన్నవోలు వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఆయనకు బెయిల్ ఇచ్చింది. అంతేకాక.. పోసాని కస్టడి పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఇప్పటికే హైకోర్టులో పోసానికి ఊరట లభించింది. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదు అయిన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News