- Advertisement -
అమరావతి: ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని కొద్ది రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయనపై చిత్తూరు, విశాఖలో నమోదు అయిన కేసుల్లో కొందరపాటు చర్యలు తీసుకోరాదని న్యాయస్థానం ఆదేశించింది. పోసానిపై మొత్తం 30 ఫిర్యాదులు నమోదు కాగా.. అందులో 16 కేసులు నమోదు చేశార. ఎపి సిఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌పై అనుచిత్ర వ్యాఖ్యలు చేసినందుకు జనసేన సభ్యులు పోసానిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఫిబ్రవరి 28వ తేదీని రాత్రి హైదరాబాద్‌లోని నివాసంలో పోసానిని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్ మీద ఆయన్ని రాజంపేట సబ్ జైలుకు తరలించారు.
- Advertisement -