Monday, March 24, 2025

రాజకీయాలకు పోసాని కృష్ణ మురళి శాశ్వతంగా గుడ్ బై!

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయ సంచలనం చోటుచేసుకుంది. వైసిపి నేత, సినీ రచయిత పోసాని కృష్ణ మురళి రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఇకపై రాజకీయాలు కూడా మాట్లాడబోనని ఆయన స్పష్టం చేశారు. వైసిపియే కాదు ఇప్పటి వరకు ఏ పార్టీలోనూ తనకు సభ్యత్వం లేదన్నారు. వైసిపి మద్దతుదారుడైన పోసాని ఇటీవల ఏపి సిఐడి నమోదు చేసిన కేసుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా అన్న అనుమానం కలుగుతోంది. ఏపి సిఐడి అధికారులు ఆయనపై అనేక సెక్షన్ల కింద  కేసులు నమోదు చేయడం కూడా ఇక్కడ గమనార్హం. పోసానిపై 111, 196, 353, 299, 336(3)(4), 341, 61(2) బిఎస్ఎస్ సెక్షన్ల కింద ఏపి సిఐడి కేసులు నమోదు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News