Monday, January 20, 2025

నన్ను హత్య చేసేందుకు నారా లోకేష్ కుట్ర: పోసాని

- Advertisement -
- Advertisement -

అమరావతి: తనను హత్య చేసేందుకు నారా లోకేష్ కుట్ర చేస్తున్నాడని సినీ నటుడు, వైసిపి నేత పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియా సమావేశంలో పోసాని మాట్లాడుతూ..  నారా లోకేష్ 18 ఎకరాల భూమి కొన్నారని తాను అన్నానని.. అందుకు తనపై రూ.4 కోట్ల పరువు నష్టం దావా వేశారని తెలిపారు. కోర్టుకు హాజరయ్యేటప్పుడు తనను లోకేశ్ చంపాలని చూస్తున్నారని పోసాని ఆరోపించారు.

తాను చచ్చిపోతే నారా లోకేష్ దే బాధ్యతని పోసాని పేర్కొన్నారు. విదేశాల్లో అమ్మాయిలతో తాగి చిందులేసిన నారా లోకేశ్ తనపై పరువు నష్టం కేసు పెడుతావా అంటూ.. లోకేశ్ బూతులు మాట్లాడిని వీడియోలను ప్రదర్శించారు. బూతులు తిట్టే లోకేశ్ పై పరువు నష్టం కేసు పెట్టకూడదా? అని పోసాని మండిపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News