Friday, December 20, 2024

ఆ విషయంలో జగన్ ను విమర్శించే అర్హత బాబుకు లేదు: పోసాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ పెట్టిన మద్య నిషేధాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎత్తేశారని నటుడు పోసాని కృష్ణ మురళి తెలిపారు. శనివారం పోసాని మీడియాతో మాట్లాడారు. ఎన్‌టిఆర్ వ్యతిరేకించిన కాంగ్రెస్‌తో చంద్రబాబు ఎలా కలిశారని ప్రశ్నించారు. ఒకసారి బిజెపి, మరోసారి కాంగ్రెస్ తో అంటకాగే చంద్రబాబు సిఎం జగన్‌ను విమర్శించే అర్హత లేదని పోసాని మండిపడ్డారు. ఎపి బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి ఎన్నిసార్లు పార్టీ మారుతారని ఎద్దేవా చేశారు. బిజెపి ఓడిపోతే మళ్లీ కాంగ్రెస్‌లో చేరిపోతారా? అని చురకలంటించారు. నిత్యం పార్టీలు మారే పురందేశ్వరికి సిఎం జగన్‌ను విమర్శించే స్థాయి లేదని పోసాని ధ్వజమెత్తారు. చంద్రబాబు పక్కా అవినీతి పరుడని, పురందేశ్వరికి కనీసం దోమంత ప్రేమ కూడా బిజెపిపై లేదని, సిఐడిపై పురందేశ్వరికి డౌటు తప్పా… కెడి బాబు గురించి ఉందని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News