Friday, December 20, 2024

లోకేష్‌తో నాకు ప్రాణహాని: పోసాని

- Advertisement -
- Advertisement -

విజయవాడ: టిడిపి నేత లోకేష్‌పై డిసిపికి ఫిర్యాదు చేశాని పోసాని కృష్ణ మురళీ తెలిపారు. మంగళవారం పోసాని మీడియాతో మాట్లాడారు. లోకేష్‌తో తనకు ప్రాణహాని ఉందని, తనని చంపేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. తనకు రక్షణ కల్పించాలని డిజిపిని కోరామన్నారు. దివంగత ముఖ్యమంత్రి, నటుడు ఎన్‌టి రామారావుకు చెప్పి వెన్నుపోటు పొడిచారా? అని పోసాని ప్రశ్నించారు. తాను అగ్రెసివ్‌గా మాట్లాడతానని తనని చంపాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. లోకేష్ బండారం మొత్తం బయటపెట్టింది తానేనని, లోకేష్ అందరి బట్టలు విప్పి కొడతానంటున్నారని, ఎంత మందివి ఎన్నిసార్లు బట్టలూడదీస్తావ్ అని పోసాని అడిగారు.

Also Read: బిజెపోళ్లే ఇవిఎం ట్యాంపరింగ్ జరుగుతుందన్నారు: కవిత

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News