- Advertisement -
ముంబై: నిర్మాత ఏక్తా కపూర్ తల్లి శోభా కపూర్ పై ముంబై పోలీసులు పోస్కో చట్టం కింద కేసుపెట్టారు. ఏఎల్ టి బాలాజీ షో ‘గంది బాత్’ వెబ్ సీరీస్ లో అనుచిత దృశ్యాలు చూపారని, తమ ఓటిటి షోలలో మైనర్ బాలికలను అశ్లీల దృశ్యాలు చూపించారని ఆరోపణ.
ప్రొడక్షన్ హౌస్ బాలాజీ టెలిఫిలిం లిమిటెడ్, ఏక్తా కపూర్,ఆమె తల్లి శోభాకపూర్ పై పాస్కో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ముంబైలోని హెచ్ బి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఐపిసి 295-ఏ, ఐటి చట్టం, పోస్కో చట్టంలోని 13 మరియు 15 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ‘గందీ బాత్’ లో ఫిబ్రవరి 2021 నుంచి ఏప్రిల్ 2021 వరకు ప్రాసరమైన ఎపిసోడ్లలో అశ్లీల దృశ్యాల్లో మైనర్ బాలికలను చూపారన్నది ఆరోపణ.
- Advertisement -