భోపాల్: మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో మహిళా బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్ డ్రెస్‌కోడ్ వివాదాస్పదమైంది. బికినీలు ధరించిన లేడీ బాడీబిల్డర్లు ఆంజనేయ స్వామి విగ్రహం ముందు ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న ఈ ప్రదర్శన నిర్వాహకులు ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మధ్యప్రదేశ్ విద్యా శాఖ మంత్రి మోహన్ యాదవ్ పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని రత్లామ్ మేయర్(బిఇజెపి) ప్రహ్లాద్ పటేల్ నిర్వహించారు.
మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి బాబీ బిల్డింగ్ కాంపిటీషన్ అని పేరు పెట్టారు. ఆంజనేయ స్వామిని బిజెపి అవమానించిందంటూ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక పోలీసు స్టేషన్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తలు హనుమాన్ చాలీసా పఠించారు. కాగా..స్థానిక బిజెపి నాయకులు సైతం ఈ ప్రదర్శనలో పాల్గొని మంత్రాలు చదివారు. అయితే&మహిళా బాడీ బిల్డర్లు డ్రెస్‌కోడ్‌తోనే స్టేజీ మీద ప్రదర్శన ఇచ్చారని వాదిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
रतलाम महापौर के मुख्य आतिथ्य में भगवान हनुमान जी की मूर्ति रखकर अश्लील प्रदर्शन वह भी मुख्यमंत्री जी के जन्मदिन के मौके पर।सनातन संस्कृति को बेचखाने वाले इस नेता पर क्या कार्यवाही होगी शिवराज जी? @BJP4India @OfficeOfKNath @digvijaya_28 @inc_jpagarwal pic.twitter.com/Xebc6dLKOW
— Bhupendra Gupta Agam (@BhupendraAgam) March 5, 2023