పోషణ పక్షోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సిడిపిఒ
మన తెలంగాణ/ మోత్కూర్: యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో ని బుజిలాపురం అంగన్వాడీ 1,2 కేంద్రాల్లో గురువారం పోషణ పక్షోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మోత్కూర్ ఐ సి డి ఎస్ ప్రాజెక్టు సి డిపిఒ జోత్స్నా పోషణ పక్షోత్సవాల్లో పాల్గొన్నారు. సందర్భంగా సిడిపిఒ జోత్స్నా మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. చిరుధాన్యాలలో అధిక పోషక విలువగల పదార్థాలు ఉంటాయని, గర్భిణీలు బాలింతలు ఈ ఆహారాన్ని తీసుకోవాలని, గర్భవతులు బాలింతలు సరైన సమయాల్లో పౌష్టిక ఆహారం తీసుకోని ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. తల్లులకు, గర్భిణీ స్త్రీలకు, బాలికలకు మిల్లెట్స్ గురించి, రక్తహీనత, చిరుధాన్యాలపై అవగాహన కల్పించారు. ఈ
కార్యక్రమంలో ఐ సి డి ఎస్ సూపర్ వైజర్ జ్యోతి, అంగన్వాడి టీచర్లు విజయ సునీత, ఆయా మమత, చిన్నారులు, తల్లులు, గర్భవతులు తదితరులు పాల్గొన్నారు.