Wednesday, January 22, 2025

ఓటమి భయం తోనే స్థానాలు మారుతున్నారు : కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

- Advertisement -
- Advertisement -

CCEA approves Rs 1500 cr infusion in IREDA

న్యూఢిల్లీ : కొందరు నేతలు ఓటమి భయంతోనే తమ నియోజకవర్గ స్థానాలను విడిచిపెట్టి మరో చోట పోటీ చేస్తున్నారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. బీజేపీకి, మంత్రి పదవికి రాజీనామా చేసి ఇటీవల సమాజ్‌వాదీ పార్టీలో చేరిన స్వామిప్రసాద్ మౌర్యపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పలు విమర్శలు చేశారు. అయిన ప్రతి ఐదేళ్లకు కొత్త స్వామి (పార్టీ)ని ఎన్నుకుంటారని ఆరోపించారు. ఇప్పుడు చాలా కష్టంలో ఉన్న ఆయన తన సొంత స్థానం నుంచి పోటీ చేయడానికి కూడా సిద్ధంగా లేరని ఎద్దేవా చేశారు. స్వామి ప్రసాద్ మౌర్య ఫడ్‌రౌవా స్థానం నుండి పారిపోవాల్సిన అవసరం ఏమిటి? అని ప్రశ్నించారు. ఆయన ఓటమి భయంతో ఉన్నారని, దీంతో ఆయన ఓడిపోవడం ఖాయమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News