Thursday, January 23, 2025

జీ20 సదస్సు నుంచి సానుకూల సంకేతం : చైనా

- Advertisement -
- Advertisement -

బీజింగ్ : న్యూఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన జి20 సదస్సుపై చైనా ఎట్టకేలకు తన స్పందన తెలియజేసింది. ప్రపంచానికి ఎదురౌతున్న సవాళ్లను ప్రాబల్యదేశాలు సమైక్యంగా పరిష్కరిస్తాయని, ప్రపంచ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దగలుగుతాయన్న సానుకూల సంకేతాన్ని సదస్సు డిక్లరేషన్ అందించిందని చైనా ప్రకటించింది.

ఈమేరకు చైనా విదేశీ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మావోనింగ్ తన ప్రకటనలో జి20 సదస్సు ఆమోదించిన డిక్లరేషన్ చైనా ప్రతిపాదనను ప్రతిబింబిస్తుందని, భాగస్వామ్యాల ద్వారా నిర్దిష్ట మార్గాల్లో ప్రపంచ దేశాలకు ఎదురౌతున్న సవాళ్లను పరిష్కరించడంతోపాటు ప్రపంచ ఆర్థిక పరిస్థితి తిరిగి కోలుకునే చర్యలు చేపడుతుందన్న సానుకూల సంకేతాన్ని జి20 సదస్సు అందించిందని పేర్కొన్నారు. జీ20 సదస్సుపై అభిప్రాయాన్ని అడగ్గా ఈ సదస్సు సన్నాహక ప్రక్రియలో చైనా నిర్మాణాత్మకమైన పాత్ర వహించిందని ఆమె వెల్లడించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని చైనా ఈ సదస్సుకు నిత్యం మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక పురోగతి, అభివృద్ధి విషయంలో వివిధ చిక్కులు, సవాళ్లను సభ్య దేశాలు సంఘీభావంతో ఎదుర్కొంటాయన్న నమ్మకం కలుగుతోందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News