Wednesday, January 22, 2025

ఒక్కరోజే 1.60లక్షల కేసులు

- Advertisement -
- Advertisement -

Positivity rate increased to 10% in India

దేశంలో 10 శాతానికి పెరిగిన పాజిటివిటి రేటు
పార్లమెంట్ సిబ్బందిలో 400 మందికి కొవిడ్
నెలాఖరులో సమావేశాలకు ముందు కలకలం
సుప్రీంకోర్టులో నలుగురు జడ్జిలు, 150మంది సిబ్బందికి కొవిడ్
యుపిలో ఒకేరోజు 7695 కేసులు

న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటల్లో 1.60 లక్షల కొత్త కేసులు వెలుగు లోకి రావడం వైరస్ తీవ్రతను తెలియచేస్తోంది. పాజిటివిటీ రేటు 10. 21 శాతానికి చేరింది. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా వేగంగా పెరుగుతున్నా యి. శనివారం 15,63,566 కరోనా నిర్ధారణ ప రీక్షలు చేయగా, 1,59,632 కొత్త కేసులు నమో దయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 10.21 శాతానికి పెరగ్గా, వారాంతపు పాజిటివిటీ రేటు 6.77 శాతం వద్ద కొనసాగుతోంది. గత 24 గం టల్లో కరోనాతో చికిత్స పొందుతూ 327 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 4,83,700 కి చేరింది. కొత్త కేసుల కారణంగా క్రియాశీల కేసుల సంఖ్యలో భారీ పెరుగుదల కని పిస్తోంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 5.3 లక్షలకు చేరి , ఆ రేటు 1.60 శాతానికి పెరిగింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 40,863 మంది కోలుకోగా, ఇప్పటివరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3.44 కోట్లు దాటింది. దేశంలో టీకా డ్రైవ్ వేగంగా సాగుతోంది. శనివారం 89,28, 310 మంది టీకాలు వేయించుకోగా, ఇప్పటివర కు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 151 కోట్లు. రెండు కోట్లకు పైగా టీనేజర్లు టీకా తీసుకున్నారు.

3,623కు చేరిన ఒమిక్రాన్ కేసులు

కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3,623 కు చేరింది. మహారాష్ట్రలో ఈ కేసుల సంఖ్య వె య్యి దాటి తొలి స్థానంలో ఉండగా, ఢిల్లీ 513, కర్ణాటక 441,రాజస్థాన్ 373 కేసులతో ఆ తర్వా తి స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఈ వేరి యంట్ నుంచి ఇప్పటికే 1,409 మంది కోలు కున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News