Thursday, January 23, 2025

సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులకు బదిలీలకు అవకాశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో సమగ్ర శిక్ష కింద మండల విద్యా వనరుల కేంద్రాల్లో పనిచేస్తున్న తాత్కాలిక కాంట్రాక్టు ఉద్యోగులకు బదిలీలకు పాఠశాల విద్యాశాఖ అవకాశం కల్పించింది. సమగ్ర శిక్షా కింద మండల విద్యావనరుల కేంద్రాల్లో తాత్కాలికంగా కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, ఐఈఆర్‌పిలతోపాటు జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో తాత్కాలికంగా కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న డాటా ఎంట్రీ ఆపరేటర్లు, సిస్టమ్ ఎనలైసిస్టులు, అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్స్ ప్రస్తుత స్థానం నుండి ఇతర స్థానాలకు మారాలనుకునే వారు ఈ నెల 23 నుంచి 225 వరకు ఐఎస్‌ఎంఎస్ పోర్టల్ నందు schooledu.telangana.gov.in తమ అభ్యర్థులను సమర్పించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తిగా అన్‌లైన్ ద్వారా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాలు, సూచనలు, మార్గదర్శకాల కోసం వెబ్‌సైట్ చూడాలని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News