Friday, November 22, 2024

 ప్రత్యక్ష బోధన లేకుండానే పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి

- Advertisement -
- Advertisement -

కరోనాతో కొన్ని రోజుల హాజరుతోనే పూర్తి కానున్న కోర్సు
గతేడాది పిజి కోర్సుల్లో చేరిన వారికి అవకాశం

Students
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా కారణంగా గత ఏడాది పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో విద్యార్థులు కళాశాలలకు వెళ్లకుండానే కోర్సు పూర్తి కానుంది. కరోనా పరిస్థితులతో ఈ విద్యార్థులకు కొంతకాలం మినహా ప్రత్యక్ష బోధన లేకుండానే కోర్సు పూర్తి కానుంది. కరోనా దృష్టా గత ఏడాది మార్చిలో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో విద్యాసంస్థలను ప్రభుత్వం మూసివేసింది. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు పాఠశాలలు, కళాశాలల్లో పూర్తి స్థాయిలో తరగతులు జరగలేదు. కొన్నింటికి ఆన్‌లైన్ ద్వారా పాఠాలు బోధించినా, మరి కొన్నింటికి ఇప్పటివరకు కాలేదు. పిజి కోర్సులకు రెండు సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది. మొదటి సంవత్సరంలో కొంతకాలం మినహా పూర్తిగా ఆన్‌లైన్‌లోనే కొనసాగగా, రెండవ సంవత్సరం కూడా ఆన్‌లైన్ తరగతులే కొనసాగుతున్నాయి. కరోనాతో కళాశాలలు తెరుచుకోకపోవడంతో గత ఏడాది పిజి కోర్సుల్లో చేరిన విద్యార్థులకు డిసెంబరు 14 నుంచి ఆన్‌లైన్ తరగతులు మొదలయ్యాయి. ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభం కాగా, కొన్ని రోజులు మాత్రమే తరగతులు కొనసాగాయి. ఆ తర్వాత మళ్లీ విద్యాసంస్థలు మూసివేయడంతో ఆన్‌లైన్ విధానంలో తరగతులు కొనసాగుతున్నాయి. కొవిడ్ కేసులు తగ్గి సాధారణ పరిస్థితులు తలెత్తితే గత ఏడాది పిజిలో చేరిన విద్యార్థులు మూడవ, నాలుగవ సెమిస్టర్లలో ప్రత్యక్ష తరగతులకు హాజరు కానున్నారు. మరికొంత కాలం ఇదే పరిస్థితి కొనసాగే మాత్రం గత ఏడాది పిజి కోర్సుల్లో చేరిన విద్యార్థులు కొంత కాలం మినహా కళాశాలలకు వెళ్లకుండానే తమ కోర్సు పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎం.టెక్,ఎం.ఫార్మసీ విద్యార్థులదీ అదే పరిస్థితి
ఎంటెక్, ఎం. ఫార్మసీ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో చేరిన విద్యార్థులకు కూడా దాదాపుగా కళాశాలలకు వెళ్లకుండానే కోర్సు పూర్తి కానుంది. ఈ రెండేళ్ల కాల వ్యవధి ఉన్న ఈ కోర్సుల్లో మొదటి ఏడాది రెండు సెమిస్టర్లు మాత్రమే థియరీ తరగతులు ఉంటాయి. మూడవ సెమిస్టర్‌లో కేవలం రెండు సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. మిగతాది అంతా ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. నాలుగవ సెమిస్టర్ వరకు ప్రాజెక్టు వర్కే ఉంటుంది. ఒకవేళ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమైనా ఈ కోర్సుల విద్యార్థులను ప్రాజెక్ట్ వర్క్‌పైనే కేటాయించనున్నారు. రాష్ట్రంలో దాదాపు 5 వేల మంది ఎం.టెక్, 2 వేల మంది ఎం.ఫార్మసీలో ప్రవేశాలు పొందారు. వారికి మొదటి సెమిస్టర్ మార్చితో పూర్తయ్యింది. రెండవ సెమిస్టర్ ఏప్రిల్ 26 నుంచి ప్రారంభమైంది. వారికి సెప్టెంబరు 18తో పరీక్షలు పూర్తవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News