Friday, December 20, 2024

వివిధ విభాగాలకు పోస్టల్ బ్యాలట్ సౌకర్యం

- Advertisement -
- Advertisement -

జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్

కామారెడ్డి ప్రతినిధి : అత్యవసర సేవల పరిధిలోకి వచ్చే వివిధ విభాగాలకు ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించిందని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ ఆదివారం ఒక ప్రకటలో తెలిపారు. ఎయిర్ పోర్ట్, రైల్వే, భారత ఆహార సంస్థ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, విద్యుత్ శాఖ, వైద్య కుటుంబ, సంక్షేమం, రవాణా, పౌర సరాఫరాలు, బిఎస్‌ఎన్‌ఎల్, మీడియా, అగ్నిమాపక విభాగాలలో విధులలో నిమగ్నమై ఓటు హక్కును వినియోగించుకోలేని వారు మాత్రమే దరఖాస్తు ఫారం, 12 (డి)లో తమ పూర్తి వివరాలతో సంభందిత రిటర్నింగ్ అధికారులకు నవంబర్ 3 నుండి 7 లోగా సమర్పించాలని ఆయన సూచించారు.

దరఖాస్తు ఫారాలను రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారుల నుంచి పొందవచ్చని, ఎన్నికల సంఘం పోర్టల్ నుంచి కూడా డైన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ అనంతరం రిటర్నింగ్ అధికారులు absentee list లను తయారు చేస్తారని, దరఖాస్తులోని వివరాలను ఎలక్టోరల్ రోల్ లోని వివరాలతో సరిపోల్చిన పిదప అర్హతగల ఓటర్ల లిస్టులను తయారు చేసి వారికి పోస్టల్ బ్యాలట్ పత్రాలను అందజేస్తారాన్నరు. తదుపరి రిటర్నింగ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ వోటింగ్ సెంటర్ (పివిసి)లలో ఓటు వేయవలసి ఉంటుందన్నారు.

ఓటింగ్ కేంద్రాలు, సమయ వివరాలు దరఖాస్తులలోని మొబైల్ నెంబర్లకు లేదా బూత్ లెవల్ అధికారుల ద్వారా తెలియచేస్తామన్నారు. ఈ ప్రక్రియ నిర్వహించేందుకు ప్రతి నియోజకవర్గ కేంద్రములో ఒక నోడల్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారితో పాటు గజిట్ అధికారిని నియమిస్తున్నామని కలెక్టర్ వివరాంచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News