Thursday, January 23, 2025

పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో దూసుకుపోతున్న బీజేపీ..

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదట పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లను ఎన్నికల సిబ్బంది లెక్కిస్తుంది. పోస్టల్‌ బ్యాలెట్‌ తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కించనున్నారు. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ దూసుకుపోతోంది.

జార్ఖండ్ లో ఇప్పటివరకు 25 స్థానాల్లో ఎన్డీయే అభ్యర్తులు ఆధిక్యం కొనసాగుతుండగా.. ఇండియా కూటమి అభ్యర్థులు 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగతున్నారు.ఇక, మహారాష్ట్రలోనూ బీజేపీ కూటమి మహాయుతి కూటమి పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. మహాయుతి కూటమి అభ్యర్థులు 50 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.. మహావికాస్ అఘాడీ కూటమికి చెందిన అభ్యర్థులు 30 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా, ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News