Monday, January 20, 2025

ఎన్నికలు సమీపిస్తున్నా..ఉద్యోగులకు అందని పోస్టల్ బ్యాలెట్లు

- Advertisement -
- Advertisement -

పెద్దేముల్: ప్రతిఒక్కరూ ఎన్నికల ఓటింగ్‌లో పాల్గొనాలని.. పోలింత్ శాతాన్ని పెంచాలని.. ప్రజాస్వామ్య మనుగడకు పాటుపడాలని జిల్లా యంత్రాంగం నిత్యం చెప్తుంది. అయితే అధికారులు చెప్పే మాటలకు.. క్షేత్ర స్థాయిలో జరిగే విధానాలకు ఎక్కడకూడా పొంతన లేకుండా పోతుంది. ఈనెల 30న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్‌లు ఇవ్వకపోవడం వలన పోలింగ్‌కు దూరం అయ్యే అవకాశాలు ఉ న్నాయి. ఎన్నికల విధులు నిర్వహించే టీచర్లు, ఇతరత్రా ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వడం లేదని తెలుస్తుంది. వికారాబాద్ జిల్లాకు చెందిన ఉద్యోగులకు దాదాపుగా పోస్టల్ బ్యాలెట్లు అందటంతో మెజారి టీ ఉద్యోగులు ఓటేశారు. కానీ, ఇదే జిల్లాలో పనిచేస్తున్న ఇతర జిల్లాల కు చెందిన కొంతమంది ఉద్యోగులు, టీచర్లకు పోస్టల్ బ్యాలెట్లు అందలేవు. ఈనెల 29న వారు ఎన్నికల విధులకు హాజరు కావాల్సి ఉన్నప్పటికి పోస్టల్ బ్యాలెట్లు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

ము ఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని మహేశ్వరం, మేడ్చల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్ తదితర నియోజకవర్గాలకు చెందిన ఉపాధ్యాయులు పెద్దేముల్ మండల పరిధిలోని పెద్దేముల్, మారేపల్లి, ఇందూరు, కొండాపూర్, సిద్ధన్నమడుగు తండా, పాషాపూర్ తదితర పాఠశాలల్లో పనిచేస్తున్నారు. వీరందరు కూడా తాండూరులోని ఆర్డీఓ కార్యాలయంలో ఫామ్ 12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, ఇతరత్రా ఉద్యోగులకు పరిగి, వికారాబాద్ తదితర నియోజకర్గాల్లో ఎలక్షన్ డ్యూటీ పడింది. వీరికి శిక్షణ ఇచ్చే ప్రా ంతంలోనే పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాల్సి ఉంది. శిక్షణకు హజరైన ఉపాధ్యాయులు పలుమార్లు వెళ్ళినప్పటికి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వలేదు. దీంతో తా ము ఓటు వేయలేకపోతామని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు పోస్టల్ బ్యాలెట్లు అందించి.. స్చేచ్ఛగా ఓటు వేయడానికి అవకాశం కల్పించాలని ఉపాధ్యాయులతో పాటుగా పలువురు ఉద్యోగులు కోరుతున్నారు.

మండలానికి చెందిన ఉపాధ్యాయులకు అత్యధికంగా పరిగిలో సమస్యలు తలేత్తాయి. ఈ నేపథ్యంలో ఇదే విషయంపై పరిగి రిటర్నింగ్ అధికారిని వివరణ కోరేందుకు రెండుసార్లు ఫోన్ చేసిన వారు అందుబాటులోకి రాలేదు. ఏదేమైనా పోస్టల్ బ్యాలెట్లు అందేలా కృషి చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News