Wednesday, January 22, 2025

Good News: తపాల శాఖ తీపి కబురు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నిత్యం ప్రజలతో మమేకమయ్యే తపాల శాఖ మరోమారు తీపి కబురు అందించింది. ప్రజలకు మరింత ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఇప్పటికే వడ్డీ రేట్లను భారీగా పెంచగా తాజాగా మళ్ళీ మరోమారు పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. జులై 1 నుంచి సెప్టెంబర్ 31 వరకు ఈ కొత్త వడ్డీ రేట్లు వర్తించనున్నాయి.

ఐదేళ్ళ రికరింగ్ డిపాజిట్(ఆర్‌డి) పై 6.5 శాతం, ఏడాది కల టర్మ్ డిపాజిట్లపై 6.9 శాతం, రెండేళ్ళ టైమ్ డిపాజిట్‌లపై 7 శాతానికి పెంచింది. మూడేళ్ళ టర్మ్ డిపాజిట్‌పై 7 శాతం, ఐదేళ్ళ టర్మ్ డిపాజిట్‌పై 7.5 శాతం, పిపిఎఫ్ బడ్డీ రేటు 7.1 శాతం, సేవింగ్స్ డిపాజిట్ 4 శాతంగా వడ్డీ రేట్లు కొనసాగనున్నాయి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్‌ఎస్‌సి) రేటు 7.7 శాతం, సుకన్య సమృద్ధి యోజన రేటు 8 శాతం, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 8.2 శాతం, కిసాన్ వికాస పత్రం రేటు 7.5 శాతం, నెలవారి ఆదాయ పథకం (ఎంఐఎస్) రేటు 7.4 శాతంగా కొనసాగుతుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్ రీజియన్ పోస్టు మాస్టర్ జనరల్ (పిఎంజి) డా. పివిఎస్ రెడ్డి సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలకు మరింత చేయూత నిచ్చేందుకు భారత ప్రభుత్వం తపాల శాఖలోని పథకాలపై భారీగా వడ్డీరేట్లను పెంచిందని తెలిపారు. ఈ పెంచిన వడ్డీ రేట్లు సెప్టెంబర్ 31 వరకు వర్తిస్తాయని తెలిపారు. ఈ కొత్త వడ్డీ రేట్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీసులో సంప్రదించాలని డా. పివిఎస్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News