Sunday, December 22, 2024

జనగర్జన పోస్టర్ విడుదల

- Advertisement -
- Advertisement -

దమ్మపేట : దమ్మపేట మండలం మందలపల్లి, రంగువారిగూడెం, జలవాగు, మారప్పగూడెం, పాత చీపురుగూడెం గ్రామాల్లో అశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ శుక్రవారం గ్రామాల్లో పర్యటించి కాంగ్రెస్ నాయకులను కలుసుకున్నారు. జులై రెండో తారీఖున ఖమ్మం లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరగబోయే భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న సందర్భంగా ముఖ్య కాంగ్రెస్ నాయకులను మర్యాదపూర్వకంగా కలిసి సభకు కలిసి రావలసిందిగా కోరారు.

అనంతరం జన గర్జన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నంశెట్టి యుగంధర్, పర్వతనేని ప్రసాద్, పునెం వెంకటేశ్వరరావు, సాయిలా నర్సి, సుగసాని శ్రీధర్ బాబు, ముళ్ళపూడి వెంకటేశ్వరరావు, చాప నాగరాజు, మొడియం వెంకటేశ్వరరావు, చింతలచెరువు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News