Monday, December 23, 2024

ఎంఎల్‌సి కవితపై బిజెపి పోస్టర్ల దాడి (వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: బిఆర్‌ఎస్, బిజెపి మధ్య పోస్టర్ల యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్‌పై గతంలో బిఆర్‌ఎస్ పోస్టర్ల ద్వారా తమ నిరసన తెలియచేయగా తాజాగా శనివారం హైదరాబాద్‌లో ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితపై పోస్టర్లు వెలిశాయి.

తెలంగాణ తలదించుకునేలా చేశావ్ అంటూ వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఈ పోస్టర్ల సృష్టికర్త బిజెపియేనన్నది నిర్వివాదాంశం. కల్వకుంట్ల ఫ్యామిలీని దూషిస్తూ బిజెపి వేసిన పోస్టర్లు నగరంలో దర్శనమిస్తున్నాయి. కాగా.. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 16న ఢిల్లీలో ఇడి కార్యాలయంలో కల్వకుంట్ల కవిత హాజరుకావలసి ఉండగా ఆమె హాజరుకాకుండా తన న్యాయవాది ద్వారా ఒక లేఖను పంపించారు.

ఇడి సమన్లను సవాలు చేస్తూ, ఇడి తనను అరెస్టు చేయకుండా రక్షణ కోరుతూ సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్ మార్చి 24న విచారణకు రానున్నందున అప్పటివరకు తాను ఇడి ఎదుట హాజరుకాలేనని ఆమె తన లేఖలో తెలియచేశారు. అయితే ఈ అభ్యర్థనను తిరస్కరిస్తూ మార్చి 20న తమ ఎదుట హాజరుకావాలని కవితను ఆదేశిస్తూ ఇడి తాజా సమన్లను జారీచేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News