Sunday, January 19, 2025

ప్రధాని మోడీకి వ్యతిరేకింగా పోస్టర్లు..

- Advertisement -
- Advertisement -

మోడీ రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ మరోసారి హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. ఈరోజు(ఆదివారం) మహబూబ్‌నగర్ జిల్లాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. ఈ సందర్భంగా జరగనున్న బిజెపి సభలో మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో మోడీకి మహబూబ్ నగర్ లో, తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదంటూ పోస్టర్లు అంటించారు. ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టు, కర్నాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారు.. తెలంగాణలోని పాలమూరు ప్రాజెక్టుకు ఇవ్వలేదంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ మీద మోడీది సవతితల్లి ప్రేమ అంటూ విమర్శలు చేస్తూ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Posters in Hyderabad against PM Modi

కాగా, మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో భాగంగా రహదారి, పెట్రోలియం, సహజ వాయువు, ఉన్నత విద్య వంటి ముఖ్యమైన రంగాలలో రూ.13,500 కోట్ల కంటే ఎక్కువ విలువైన అనేక ఇతర అభివృద్ధ్ది ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News