Friday, January 10, 2025

రూ. 4 కోట్ల డిపాజిట్లు స్వాహా: పోస్టుమాస్టర్ పరారీ

- Advertisement -
- Advertisement -

మెయిన్‌పురి(యుపి): ఖాతాదాదులు దాచుకున్న రూ. 4 కోట్ల సొమ్మును కాజేసిన ఉత్తర్‌ప్రదేశ్ మెయిన్‌పురిలోని ఔగోతా ప్రాంతానికి చెందిన ఒక గ్రామీణ పోస్టు మాస్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

దాదాపు 16 గ్రామాలకు చెందిన గ్రామస్తులు ఈ పోస్టు ఆఫీసులో తమ నగదును సేవింగ్స్, ఫిక్సెడ్ డిపాజిట్ రూపంలో భద్రతపరుచుకోగా ఆ పోస్టు ఆఫీసుకు చెందిన పోస్టుమాస్టర్ వాటిని స్వాహా చేసి పరారయ్యాడు. తమ పొదుపు మొత్తాలను విత్‌డ్రా చేసుకోవడానికి వెళ్లిన గ్రామస్తులకు తమ కాతాలో డబ్బే లేకపోవడంతో అవాక్కై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది.

అనేక సంవత్సరాలుగా అదే పోస్టు ఆఫీసులో పోస్టు మాస్టర్‌గా పనిచేస్తున్న ఓంప్రకాష్ శాక్యపై పోలీసులు వివిఇధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు.

ఈ ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించిన పోస్టల్ శాఖ నిర్లక్ష్యానికి పాల్పడ్డారన్న ఆరోపణపై నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసింది. తమ డివిజనల్ సూపరింటెండెంట్ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారని, దీనిపై విచారణ జరుగుతోందని ఔగోతా పోస్టు ఆఫీసుకు చెందిన హెడ్ పోస్టుమాస్టర్ తెలిపారు.

దాదాపు 40 కస్టమర్ల నుంచి తమ ఖాతాల్లోనుంచి డబ్బు మాయమైనట్లు ఫిర్యాదు అందిందని, బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని దర్యాప్తు అధికారి రవి కుమార్ చెప్పారు. డజనుకు పైగా పోస్టు ఆఫీసు సేవింగ్స్ సర్టిఫికెట్లు, ఫెక్సెడ్ డిపాజిట్లు గల్లంతైనట్లు స్థానిక గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. మొత్తం కుంభకోణం రూ. 4 కోట్లకు పైగా ఉంటుందని వారు చెబుతున్నారు.
============

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News