Monday, December 23, 2024

పోస్టుమాస్టర్‌ల చేతివాటం.. ఆసరా పెన్షన్ రూ.16 స్వాహా…

- Advertisement -
- Advertisement -

జయశంకర్ భూపాలపల్లి/కన్నాయిగూడెం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండవసారి సార్వత్రిక ఎన్నికలలో ఘన విజయం సాధించిన తర్వాత వృద్దులకు, వికలాంగులకు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వృద్దులకు రూ. 2016, వికలాంగులకు రూ. 3016 ఆసరా పెన్షన్లు పెంచడం జరిగింది. ఈ పెంచిన ఆసరా పెన్షన్ డబ్బులను 2014, నవంబర్ 08 నుండి పెన్షన్‌దారులకు ఇవ్వడం జరుగుతుంది. మండలంలో మొత్తం 1478 మంది వృద్ద, వికలాంగ పెన్షన్‌దారులు ఉన్నారు. కన్నాయిగూడెం మండలంలో ఆసరా పెన్షన్ దారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పెన్షన్ల డబ్బులను కొందరు బ్రాంచ్ పోస్టుమాస్టర్లు రూ. 16 చొప్పున స్వాహా చేయడం జరుగుతుందని పలువురు ఆసరా పెన్షన్‌దారులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్దులకు, వికలాంగులకు ఆసరా కోసం ఇస్తున్న ఆసరా పెన్షన్ డబ్బుల్లో రూ. 16 కత్తెర చేయడం ఏంటని వృద్దులు, వికలాంగులు ఆగ్రహం వ్యక్త చేస్తున్న కూడా బ్రాంచ్ పోస్టుమాస్టర్స్ సమాధానం ఇవ్వకుండా మండలవ్యాప్తంగా పలు గ్రామాలలో తమ చేతివాటం ప్రదర్శించడం జరుగుతుంది. మండలంలో 1478 మంది ఆసరా పెన్షన్ దారులు ఉంటే ఒక నెలకు, ఒక పెన్షన్‌దారునికి రూ. 16 రూపాయలు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు ఇవ్వకుంటే ఒక నెలకు రూ. 23648 మిగులుతాయి. మండల వ్యాప్తంగా 2014 నుండి ఒక పెన్షన్‌దారుని వద్ద నుండి రూ. 16 స్వాహా చేస్తే 8 సంవత్సరాల వ్యవధిలో లక్షల్లో డబ్బులు స్వాహా చేసారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి నెల 23,648 రూపాయలు అయితే ఒక సంవత్సరానికి రూ. 2, 83, 776 రూపాయలు అయితే 8 సంవత్సరాలకు రూ. 22,70,208 స్వాహా చేయడం జరిగిందని పలువురు మండల వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల వ్యాప్తంగా ఇంత పెద్ద మొత్తంలో ఆసరా పెన్షన్ దారుల నుండి డబ్బులు స్వాహా చేస్తున్నా కూడా మండల, జిల్లా అధికారులు స్పందించకపోవడం అవినీతికి ఊతం ఇస్తున్నట్లే అనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. తక్షణమే జిల్లా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆసరా పెన్షన్‌దారులు కోరుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News