- Advertisement -
హైదరాబాద్ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద మంగళవారం (నేడు) బిజెపి తలపెట్టిన మహా ధర్నాను వాయిదా వేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ తెలిపారు. మూడు రోజుల పాటు హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలిగించకూడదనే ఉద్దేశంతో ఈ మహాధర్నాను వాయిదా వేసినట్లు తెలిపారు. ఈ మహాధర్నాను నిర్వహించడం కోసం నిర్ణయించాల్సిన తేదీని అతి త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ మహాధర్నాకు హైకోర్టు షరతులతో అనుమతి ఇచ్చిన విషయం విధితమే.
- Advertisement -