Tuesday, November 5, 2024

హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ ఘటన తరువాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే కొన్ని పరీక్షలు రద్దు చేయగా, మరికొన్ని పరీక్షలను వాయిదా వేసింది. తాజాగా హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు టిఎస్‌పిఎస్‌సి ప్రకటించింది. ఏప్రిల్ 4వ తేదీన జరగాల్సిన ఈ పరీక్షను, జూన్ 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కమిషన్ తెలిపింది.

నెలాఖరులో రద్దయిన పరీక్షల కొత్త షెడ్యూల్…?

టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నాపత్రాలు లీకేజీ కేసు తరువాత సిట్ అధికారుల సూచనలు మేరకు టిఎస్‌పిఎస్‌సి ఇప్పటికే నిర్వహించిన గ్రూప్ -1 ప్రిలిమ్స్, ఎఇఇ, డిఎఒ, ఎఇ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ నెలలో జరగాల్సిన టిపిబిఒ, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల పరీక్షలను సైతం కమిషన్ వాయిదా వేసింది. తాజాగా వీటి జాబితాలో హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష కూడా చేరింది. ఏప్రిల్, మేలో జరగాల్సిన పరీక్షలు వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్.. ఈ క్రమంలోనే రద్దు చేసిన, వాయిదా వేసిన పరీక్షలకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను ఈ నెలాఖరులోగా ప్రకటించే అవకాశమున్నట్లు తెలిపింది. సాధారణంగా ఏదైనా పోటీ పరీక్షకు రెండు నెలల ముందుగా ప్రశ్నాపత్రాలు సిద్ధం చేస్తారు.

రానున్న రెండు నెలల్లో జరగాల్సిన పరీక్షలకు ప్రశ్నాపత్రాలను సిద్ధం చేయడానికి కొంత సమయం పట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే గ్రూప్ -4, గ్రూప్ 2 పరీక్షల తేదీలను ప్రకటించిన కమిషన్ వీటిని అనుకున్న సమయానికే నిర్వహించాలా..?, వద్దా..? అనే విషయంపై ఆలోచిస్తున్నట్లు తెలిసింది. తొలుత గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి.. జులై 1వ తేదీన గ్రూప్ -4, ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్- 2 పరీక్షలు నిర్వహించడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ మూడింటినీ వరుసగా నిర్వహిస్తే.. అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తుతాయా..? సిద్ధమయ్యేందుకు సమయం సరిపోతుందా..? అనే అంశాలపై కమిషన్ చర్చిస్తున్నట్లు సమాచారం. కేంద్ర, ఇతర పోటీ పరీక్షల తేదీలను దృష్టి పెట్టుకొని అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించాలని టిఎస్‌పిఎస్‌సి ఆలోచిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News