Wednesday, January 22, 2025

లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

బిసి గురుకుల డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించారు. తాత్కాలిక ప్రాతిపదికన పనిచేయుటకు అర్హులైన మహిళా అభ్యర్థులు ఈ నెల 13లోగా దరఖాస్తు చేసుకోవాలని బిసి గురుకుల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు ఒక ప్రకటనలో కోరారు. కరీంనగర్, వనపర్తి గురుకుల వ్యవసాయ కళాశాలలలో (ఒక్కొక్కటి చొప్పున) అగ్రానమీ (2), లైవ్ స్టాక్ అండ్ ఎనిమల్ హస్బెండ్రీ(2), జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ (2), ఎంటోమోలజీ (2), అగ్రికల్చరల్ ఎకనామిక్స్(2), ప్లాంట్ పాథాలజీ (2), అగ్రికల్చరల్ ఎక్సటెన్షన్ (2) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందుకు గాను అభ్యర్ధులు సంబంధిత విభాగంలో పీహెచ్ డి లేదా ఎంఎస్‌సి (అగ్రికల్చర్) చేసి ఉండాలి. లైవ్ స్టాక్ & ఎనిమల్ హస్బండ్రీ పోస్టుకు గాను సంబంధిత విభాగంలో పి హెచ్ డి లేదా ఎంఎస్‌సి చేసి ఉండాలి.

పీహెచ్ డి, నెట్ అర్హతలు కలిగి ఉన్న అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుందనిఆయన తెలిపారు. పీహెచ్ డి కలిగి ఉండి ఫుల్ టైం పనిచేసే టీచింగ్ అసోసియేట్స్ కి, ఎంఎస్‌సి కలిగి ఉండి ఫుల్ టైం పనిచేసే టీచింగ్ అసోసియేట్స్ కి, పార్ట్ టైం టీచింగ్ అసోసియేట్స్ కి తగిన విధంగా గౌరవ వేతనం ఇవ్వబడుతుందని కార్యదర్శి పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్ధులు ఈనెల 13వ తేదీ లోగా తమ పూర్తి వివరాలను mjpkrnagbsc2022@gmail.com కి మెయిల్ చేయాలని, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు డెమో, ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందని, ఇంటర్వ్యూ తేదీలు త్వరలో తెలియ జేస్తామని కార్యదర్శి గారు పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం 76809 41504 ఈ నెంబర్ లో సంప్రదించాలని ఆయన సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News