Saturday, April 5, 2025

పొటాటో అంటే ఉల్లిగడ్డే కదా అని అడిగిన జగన్ (వీడియో)

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఆలుగడ్డకు, ఉల్లిగడ్డకు తేడా తెలిసినట్లు లేదని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. తిరుపతి జిల్లా వాకాడు మండలంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ శుక్రవారం పర్యటిచారు.  స్వర్ణముఖి నది కట్టతెగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. పొటాటోను తెలుగులో ఏమంటారో తెలియక పక్కనే ఉన్న అధికారులను ‘పొటాటోను ఏమంటారు… ఉల్లిగడ్డే కదా’ అనడంతో సభకు హాజరైన జనంలో నవ్వులు విరిశాయి. అధికారులు బంగాళా దుంప అని చెప్పడంతో ‘బంగాళా… దుంప’ అని పట్టిపట్టి అంటూ ప్రసంగాన్నికొనసాగించారు.

Curtsy by TV 5

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News