Sunday, December 22, 2024

ఎపి జల చౌర్యం

- Advertisement -
- Advertisement -

శ్రీశైలం నిండక ముందే పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తివేత

వచ్చిన వరదను వచ్చినట్టుగా సీమకు తరలింపు

వేగంగా తగ్గిపోతున్న శ్రీశైలం నీటి మట్టం

కెఆర్ఎంబి చోద్యం

మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల పరిధిలోని కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి నిర్వహణపై సమన్వయం లోపించింది. శ్రీశైలం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద నీరు చేరి..చేరకముందే ఉన్న కొద్దిపాటి నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించుకు పొతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తివేసి శ్రీశైలం ప్రాజెక్టులోని కృష్ణానదీజలాలను సీమ ప్రాజెక్టులకు విడుదల చేస్తోంది. శ్రీశైలం , నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణకోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కృష్ణానదీ యాజమాన్యబోర్డు నుంచి కనీసం నామమాత్రపు అనుమతినైనా తీసుకోకుండా ఏపి ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ గేట్ల ఎత్తివేతపై తెలంగాణ రాష్ట్ర రైతాంగంనుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తెలుగు రా్రష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్న శ్రీశైలం ,నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు సబంధించి జూన్‌నుంచి ప్రారంభమైన ఈ నీటి సంవత్సరంలో నీటి వాటాలు, నీటినిర్వహణ తదితర అంశాలపైన కృష్ణాబోర్డులో ఇప్పటివరకూ ఏవిధమైన చర్చలు ,నిర్ణయాలు జరగలేదు. బోర్డు కూడా అ దిశగా గట్టి చర్యలు తీసుకోలేదు. త్రిసభ్య కమిటి సమావేశం నిర్వహించినా, అది కూడా తాగునీటి అవసరాలకు సంబంధించి మాత్రమే సూత్రప్రాయ నిర్ణయాలు జరిగాయే తప్ప బోర్డు పూర్తి స్థాయి సమావేశాన్ని నిర్వహించలేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండున్న నెలలు గడుస్తున్నా ఇప్పటివరకూ బోర్డు కీలక సమావేశం నిర్వహణ పట్ల మీనమేషాలు లెక్కిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.

వేగంగా ఖాళీఅవుతున్నశ్రీశైలం రిజర్వాయర్
పోతిరెడ్డిపాడు గేట్ల ఎత్తివేతతో శ్రీశైలం రిజర్వాయర్ వేగంగా ఖాళీ అవుతోంది. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వస్తున్న నీటికి , బయటకు విడుదల చేస్తున్న నీటికి పొంతన ఉండటం లేదు. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట స్థాయి నీటిమట్టం 885అడుగులు కాగా, గరిష్ఠ స్థాయి నీటినిలువ సామర్ధ్యం 210టిఎంసీలు. అయితే ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 118టిఎంలు మాత్రమే నిలువ ఉంది. ప్రాజెక్టు నీటిమట్టం కూడా 863.80అడుగులు ఉంది. ఇంకా సగానికిపైగా రిజర్వాయర్ ఖాళీగానే ఉంది. ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకోవాలంటే ఇంకా 22అడుగులకు పైగా నీటిమట్టం పెరగాల్సివుంది. నిటి నిలువ కూడా గరిష్ట స్థాయి సామర్దానికి చేరుకోవాలంటే ఇంకా 92టిఎంసీల నీరు ఎగువ నుంచి చేరాల్సివుంది.

అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే నీటినిర్వహణలో సమన్వయం తప్పితిపోయింది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి చేరుతున్న నీటికంటే 12రెట్లు అధికంగా రిజర్వాయర్ నుంచి నీరు బయటకు వెళుతోంది. ఆదివారం ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 1979క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టు నుంచి 25474క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. రోజుకు రెండు టీఎంసీల నీరు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి జారుకుంటోంది. ఇందులో అత్యధికశాతం నీరు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గేట్ల ద్వారా శ్రీశైలం కుడి ప్రధాన కాలు నుంచి బనకచర్ల క్రాస్‌రెగ్యులేటర్‌కు , అక్కడి నుంచి తెలుగు గంగ, ఎస్కేప్ చానల్ , ఎస్‌ఆర్‌బిసి , గాలేరు నగరి కాలువలకు విడుదలవుతోంది.

తెలుగుగంగ పధకంలోని ఒక్క వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకే 10550క్యూసెక్కుల నీటిని మళ్లిస్తున్నారు. ఇక ఎస్‌ఆర్‌బిసి, గాలేరు నగరి , కర్నూలుకడప కాలువ లోకి విడుదలవుతున్న నీటి ప్రవాహాలను లెక్కలోకి చూపటం లేదు. మరోవైపు ముచ్చమర్రి ఎత్తిపోతల పధకం ద్వారా హంద్రీనీవా ప్రాజెక్టుకు కృష్ణనదీజలాలను తరలిస్తున్నారు. ప్రాజెక్టులో ఇన్‌ఫ్లోతో ఏ మాత్రం సంబంధం లేకుండా నీటి విడుదల ఇలాగే ఉంటే శ్రీశైలం ప్రాజెక్టు వేగంగా ఖాళీఅవుతుందంటున్నారు.

చేతులెత్తేసిన కృష్ణాబోర్డు !
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు లేకుండానే కృష్ణనదీజలాలను తరలించుకుపోతుంటే ఏపిని కట్టడి చేసి నీటి విడుదలను నియంత్రించటంలో కృష్ణానదీయాజమాన్యబోర్డు చేతులెత్తేసిందన్న విమర్శలు వ్యక్తమతున్నాయి. గత ఏడాది కూడా ఏపి ప్రభుత్వం తనకు కేటాయిచింని కోటా నీటికంటే 205టిఎంసీలకు పైగా నీటిని అధికంగా ,అక్రమంగా ఉపయోగించుకుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణానదీజలాల తరలింపును యధేశ్చగా కొనసాగిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News