Saturday, November 23, 2024

తెలుగు విశ్వవిద్యాలయం కోర్సుల ప్రవేశ ప్రకటన విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతి ఏటా నిర్వహించే వివిధ కోర్సులకు సంబంధించిన ప్రవేశ ప్రకటనను బుధవారం విడుదల చేశారు. 2023-24 విద్యా సంవత్సరానికి విశ్వవిద్యాలయం నిర్వహించే రెగ్యులర్ కోర్సులలో ప్రవేశం కల్పించడానికి అర్హత కల్గిన విద్యార్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు.

శిల్పం, చిత్రలేఖనం, డిజైన్స్, లైబ్రరీసైన్స్, సంగీతం, రంగస్థలం, నృత్యం, జానపదం, తెలుగు, చరిత్ర, పర్యాటకం, భాషాశాస్త్రం, జర్నలిజం, జ్యోతిషం, యోగా తదితర అంశాలలో తెలుగు విశ్వవిద్యాలయం పి.జి, యు.జి, పి.జి డిప్లమా, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను నిర్వహిస్తుంది. ఆయా కోర్సులలో ప్రవేశం పొందగోరే ఆసక్తిగల అభ్యర్థుల నుండి విశ్వవిద్యాలయం వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ దరఖాస్తులను కోరుతున్నారు. దరఖాస్తులను 16 జూన్ లోగా, ఆలస్య రుసుముతో జూన్ 30లోగా విశ్వవిద్యాలయానికి సమర్పించవలసిందిగా వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ తెలిపారు.

2022-24 పిహెచ్‌డి ప్రవేశాలు
భాషాశాస్త్రం, సంగీతం, నృత్యం, రంగస్థలం, జానపదం, జర్నలిజం, చరిత్ర, సంస్కృతి, పురావస్తు శాస్త్రం, జానపద గిరిజన విజ్ఞానం అంశాలలో తెలుగు విశ్వవిద్యాలయం 2023-24 విద్యా సంవత్సరానికి సిహెచ్‌డి ప్రోగ్రాంలలో ప్రవేశం కోసం ఆన్ లైన్ ద్వారా అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు. పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయం వెబ్ సైట్ www.teluguuniversity.ac.in లేదా www.pstucet.org సంప్రదించవచ్చని వర్సిటీ రిజిష్ట్రార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News