Sunday, February 23, 2025

పేట్ బషీరాబాద్ పియస్ పరిధిలో దారుణం

- Advertisement -
- Advertisement -

పేట్ బషీరాబాద్ పియస్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం..జై రామ్ నగర్ కాలనీ లోని నిర్మాణుష్య ప్రాంతంలో ఆడుకునేందుకు ఐదుగురు మైనర్లు..(అందులో ముగ్గురు అబ్బాయిలు , ఇద్దరు బాలికలు) వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరు అమ్మాయిల పై పెట్రోల్ దాడి జరిగింది. ఈ ఘటనలో ఒక బాలిక(10)కు తీవ్ర గాయలు కాగా మరో బాలిక (9)కు స్వల్ప గాయాలైనవి. స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఇద్దరు బాలికలను గాంధీ హాస్పిటల్ కు తరలించారు.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మైనర్ లకు పెట్రోల్ డబ్బా తో పాటు అగ్గిపెట్టే ఎక్కడి నుండి వచ్చింది అన్న కోణంలో దర్యాప్తు  చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News