- Advertisement -
- నీట మునిగిన పంట పొలాలు
కొండాపూర్: భారీ వర్షాలు రైతులను నిండ ముంచాయి. నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో కొండాపూర్ మండలంలోనే అత్యధికంగా 8.8 వర్షపాతం కురిసింది. మంగళవారం కొండాపూర్ మండల పరిధిలోని సైదాపూర్, అనంతసాగర్, గంగారం, మారెపల్లి, సి.కోనాపూర్, మల్లెపల్లి, గొల్లపల్లి గ్రామాల్లో పత్తి పంట వందలాది ఎకరాల్లో నీటమునిగింది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పత్తి పొలాల్లోకి , పప్ప దినుసులలోకి వరద నీరు రావడంతో పత్తి మొక్కలు పూర్తిగా దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని గ్రామాల్లో వరద నీటికి కూరగాయలు, పూల తోటలు కొట్టుకుపోయాయి. నీటి దెబ్బకు తీవ్రంగా పంట నష్టపోయామని, వర్షం తమను నిండ ముంచిందన్నారు. మల్కాపూర్, అనంతసాగర్, కొండాపూర్ చెరువులు మత్తడి దంచికొడుతున్నాయి. వ్యవసాయ అధికారులు స్పందించి రైతులను ఆదుకోవాలని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు.
- Advertisement -