Thursday, January 23, 2025

తోటి ప్రయాణికులపై రైల్లో పెట్రోల్ చల్లిన ఉన్మాది: ముగ్గురి సజీవదహనం

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: వేగంగా వెళుతున్న రైలులో ఒక గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్ చల్లి నిప్పుపెట్టడంతో ముగ్గురు వ్యక్తులు సజీవదహనం కాగా మరి ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటన ఆదివారం రాత్రి కేరళలోని కోజిక్కోడ్ వద్ద జరిగింది. అళప్పుళ-కన్నుర్ ఎగ్జిక్యుటివ్ రైలులో ఆదివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. కన్నూర జిల్లాకు చెందిన మహిళ, రెండేళ్ల బాలిక, మరో వ్యక్తి మృతదేహాలు రైలు పట్టాలపై లభించాయి. ఈ ఘటనలో మరో 8 మంది ప్రయాణికులు గాయపడగా వారిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం….డి1 కోచ్‌లోకి ఒక గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్ వంటి ద్రవ పదార్థంగల రెండు సీసాలతో ప్రవేశించాడు. సీసాలలోని ద్రవాన్ని ప్రయాణికులపై చల్లి నిప్పుఅంటించాడు. వెంటనే మంటలు కోచ్‌లో వ్యాపించడంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు రైల్లోని చెయిన్‌ను లాగి రైలును నిలిపివేశారు. దీంతో ఆ అపరిచితుడు రైలు దిగి పారిపోయాడు. అతనికి కూడా గాయాలు అయినట్లు తెలుస్తోంది. ప్రయాణికులే కష్టపడి కోచ్‌లో వ్యాపించిన మంటలను ఆర్పివేశారు. రైలు పట్టాల వెంబడి తనిఖీలు నిర్వహించగా మూడు మృతదేహాలు లభించాయి. మంటల నుంచి కాపాడుకునేందుకు ఈ ముగ్గురూ రైలు నుంచి దూకి ఉంటారని పోలీసులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News