Friday, November 22, 2024

పీఓడబ్లూ జాతీయ కన్వీనర్ సంధ్యపై కేసు ఎత్తివేయాలి

- Advertisement -
- Advertisement -

నర్సంపేట: పీఓడబ్లూ జాతీయ కన్వీనర్ వి. సంధ్య, ప్రొఫెసర్ హరగోపాల్, పద్మజా షాలపై అక్రమంగా మోపిన ఉ.పా కేసులన వెంటనే ఎత్తివేయాలని పీవైఎల్, పీఓడబ్లూ రాష్ట్ర కార్యదర్శి ఎలకంటి రాజేందర్, జిల్లా కార్యదర్శి పూలక్క అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ములుగు జిల్లా తాడ్వాయి పోలీసులు 2022 ఆగస్టు 19న పీఓడబ్లూ జాతీయ కన్వీనర్ వి. సంధ్య, ప్రజాపక్ష మేధావి జి. హరగోపాల్, 152 మంది ప్రజా సంఘాల నాయకులపై తప్పుడు పద్ధతుల్లో రాజద్రోహ కుట్ర కేసు ఉపా కేసును నమోదు చేశారని, వీరంతా మావోయిస్టు పార్టీకి అనుబంధంగా ఉండే సంఘాల్లో పనిచేస్తూ రాజద్రోహానికి పాల్పడుతున్నారని, వీరందరిని కఠినంగా శిక్షించాలని, అక్రమంతా తప్పుడు కేసులను బనాయించారన్నారు.

ఉపాతో పాటు అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని పీఓడబ్లూ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుందన్నారు. గత నాలుగు దశాబ్దాలకు పైగా మహిళల హక్కుల కోసం వి. సంధ్య పోరాడుతున్న చరిత్ర అందరికీ తెలిసిందే అన్నారు. అవిశ్రాంతంగా ప్రజాస్వామిక పద్ధతుల్లో పోరాడుతున్న సంధ్యను నిషేదిత మావోయిస్టు పార్టీకి చెందిన వ్యక్తిగా ముద్ర వేయడం అత్యంత దుర్మార్గమన్నారు. ములుగు జిల్లా పోలీసులు అక్రమంగా బనాయించిన ఈ అక్రమ, తప్పుడు కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు పోరాడి సాధించుకున్న తెలంగాణలో అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న అనేక మంది ప్రజా నాయకులను, మేధావులను అక్రమ కేసుల్లో బనాయించడాన్ని ఇకనైనా మానుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా నాయకులు, ఏఐకేఎంఎస్ డివిజన్ అధ్యక్షుడు గట్టి కృష్ణ, పీవైఎల్ జిల్లా నాయకుడు సంపత్, పాణి, మల్లన్న, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News