Saturday, November 16, 2024

కర్నాటకలో మూడోసారి పెరిగిన కరెంటు ఛార్జీలు…విద్యుత్తు ఇక ఖరీదే!

- Advertisement -
- Advertisement -

 

Electricity Unit cost raising in Karnataka

బెంగళూరు: కర్నాటక ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (కెఇఆర్‌సి) విద్యుత్ సరఫరా కంపెనీలను (ఎస్కామ్‌లు) అదనపు ఖర్చులను రికవరీ చేయడానికి అనుమతించినందున విద్యుత్ ధర యూనిట్‌కు 43 పైసలు పెరగనుంది. గృహోపకరణాలు,  వినియోగాన్ని బట్టి సగటు కుటుంబం 50 యూనిట్ల నుండి 100 యూనిట్ల వరకు వినియోగిస్తుంది.

ఈ సంవత్సరం, ఏప్రిల్‌లో వార్షిక సుంకాన్ని యూనిట్‌కు 35 పైసలు పెంచడంతో పెంపుదల శ్రేణి ప్రారంభమైంది. జూన్‌లో ఇంధన సర్దుబాటు ఛార్జీల రూపంలో రెండో పెంపుదల వచ్చింది. KERC ప్రతి యూనిట్‌కు ఇంధన సర్దుబాటు ఖర్చులను సేకరించడానికి ఎస్కామ్‌లను అనుమతించింది …జూలై 1 నుండి డిసెంబర్ 31 వరకు ప్రతి యూనిట్‌కు 31 పైసలు (బెస్కామ్) నుండి 27 పైసలు (హెస్కామ్), 26 పైసలు (గెస్కామ్), 21 (మెస్కామ్) మరియు 19 పైసలు (సెస్క్) వసూలుకు అనుమతించారు.

KERC  సెప్టెంబర్ 19 నాటి మూడవ ఆర్డర్ అక్టోబరు 1 నుండి మార్చి 31, 2023 వరకు విద్యుత్ ఛార్జీలను పెంచింది. సవరించిన ధరల ప్రకారం, బెస్కామ్ వినియోగదారులు అదనంగా 43 పైసలు చెల్లిస్తారు, కాగా  హెస్కామ్ (35), గెస్కామ్ (35) ),CESC (34),  మెస్కామ్ (24)  వినియోగదారలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News