Thursday, December 26, 2024

నష్టాల్లో ఉన్న విద్యుత్ సంస్థలకు కాపాడాలంటే

- Advertisement -
- Advertisement -

విద్యుత్ పొదుపు కూడా తప్పని సరే
పొదుపు చేస్తే విద్యుత్‌ను ఉత్పత్తి చేసినట్లే
విద్యుత్ అధికారులు

Power companies are loss
మన తెలంగాణ,సిటీబ్యూరో:  ప్రస్తుతం నష్టాల్లో ఉన్న విద్యుత్ సంస్థలను లాభాల బాట పట్టించాలంటే… ఉద్యోగులు అంతర్గత సామర్థాన్నిపెంచు కోవడంతో పాటు వృథాను అరికట్టాలని ఉన్నతాధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌ను పొదుపు చేసే బాధ్యత కేవలం ఉద్యోగులదే కాదని వినియోగదారులపై కూడా ఉందంటున్నారు. విద్యుత్‌ను పొదుపు చేయడమంటే ఉత్పత్తిలో వినియోగదారులు తమ వంతు పాలుపంచుకున్నట్లే అవుతుందంటున్నారు. మనం ధనాన్ని ఏవిధంగా పొదుపుగా, వృథా లేకుండా ఖర్చు చేస్తామో అదే పద్దతిలో విద్యుత్‌ను కూడా అనవసరంగా ఉపయోగిస్తూ వృథా చేయవద్దని సూచిస్తున్నారు. గదుల్లో సహజంగా వెలుతురు ప్రసరించేలా చూసుకోవాలని, కిటీకిలు, తలుపులు తెరిచి ఉంచడం ద్వారా ధారళామైన గాలి లోపలికి వస్తుందని చెబుతున్నారు. దారాళంగా గాలివెలుతురు వచ్చే గృహాల్లో అనారోగ్య సమస్యలు ఉండవని, మానసికంగా ఎంతో అహ్లాదకరంగా ఉంటుందని చెబుతున్నారు. పగటి సమయంలో కూడా 24 గంటలు విద్యుత్ దీపాలు మధ్యజీవనం సాగిస్తుంటే కొన్ని మానసిక సమస్యలతో పాటు, కొన్ని రకాల వైరస్‌లు విజృంభించడంతో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. వీటిని నివారించేందుకు పగటి సమయంలో విద్యుత్‌ను తక్కువగా ఉపయోగించి, సహజంగా గాలి వెలుతురు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

గృహవిద్యుత్ వినియోగదారులు ఇలా చేస్తే సరి….

విద్యుత్ వినియోగంలో కేటగిరి 1 కిందకు వచ్చే గృహ,సాధారణ వినియోగదారులు అవసరమైన విద్యుత్‌ను ఉపయోగించాలి. గదుల్లో వ్యక్తలు లేని సమయంలో లైట్లు,ఫ్యాన్లు ఆర్పివేయాలి ఎల్‌ఈడి బల్బులు మాత్రమే వినియోగించాలి. 5 స్టార్ రేటింగ్ ఉన్న విద్యుత్ పరికరాలు వాడాలి. ఫ్రిడ్జ్ డోర్లు తెరిచి ఉంచకూడదు.అవసరమైనప్పుడు మాత్రమే ఫ్రిడ్జ్ డోర్లను తెరిచి ,వెంటనే మూసి ఉంచినట్లయితే విద్యుత్ ఆదా అవుతుంది. ఇండ్లలో నీటిని వేడిచేసేందుకు ఇన్వర్టర్ వాటర్ హీటర్ల వినియోగానికి దూరంగా ఉండాలి. లేక పోతే వాటి ద్వారా పెద్దమొత్తంలో బిల్లు వచ్చే అవకాశం ఉంటుంది. సోలార్ పవర్ ప్లేట్లను,బిల్డింగ్ పైన ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేసుకసుని సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకుని సోలార్ నెట్ మీటర్ ద్వారా విద్యుత్ బిల్లులను తగ్గించు కోవచ్చు.

వాణిజ్య వినియోగదారులు:

కేటగిరి 2లోకి వచ్చే వాణిజ్య విద్యుత్ వినియోగదారులు ఎల్‌ఈడి బల్బులను తప్పనిసరిగా వినియోగించాలి. ఫోకస్ లైట్లు, హలోజన్ బల్బులు అధిక విద్యుత్‌ను వినియోగిస్తాయి కావునా ఎల్‌ఈడి విద్యుత్ లైట్ల వినియోగానికి ప్రాధాన్యతా ఇవ్వాలి. అన్ని కార్యాలయాల్లో కూడా అవసరానికి తగిన విధంగా లైట్లు, ఫ్యాన్లు ఉపయోగించాలి. అవసరం లేనప్పుడు పరికరాలు, స్విచ్‌లు, లైట్లు ఆఫ్ చేయాలి. కార్యాలయాల్లో పని చేసే సిబ్బంది విద్యుత్ పొదుపు దృష్టి సారించి దుబారాను అరికట్టాలి.

పరిశ్రమలు:

పరిశ్రమలు కోసం విద్యుత్‌ను వినియోగించే వినియోగదారులు 3,4 కేటగిరిలో కిందకు వస్తారు. అన్ని రకాల మోటార్లకు తప్పని సరిగా కెపాసిటర్లను వినియోగించినట్లయితే విద్యుత్ పొదుపు చేయవచ్చని తద్వారా భారీస్థాయిలో బిల్లులు వచ్చే అవకాశం ఉండదంటున్నారు. అన్ని ప్రదేశాల్లో ఎల్‌ఈడి బల్బులు మాత్రమే వినియోగించాలని, హలోజన్ బల్బుల స్థానంలో ఎల్‌ఈడి ట్యూబ్ లైట్లను వినియోగించి విద్యుత్‌ను పొదుపు చేయవచ్చని చెబుతున్నారు. సహజ సిద్దంగా వెలుతురు వచ్చేట్లుగా షెడ్‌ల పై భాగంలో గ్లాస్ టాప్‌లను ఏర్పాటు చేసుకుని కిటీకీలన్నీ తెరిచి ఉంచాలని సూచిస్తున్నారు.

వ్యవయ సర్వీసులు:

కేటగిరి 5కింద వచ్చే సర్వీసులు వ్యవసాయదారులు వినియోగదారులుగా ఉంటారని,అన్ని రకాల మోటార్లకు తప్పని సరిగా అవసరమైన కెపాసిటర్లను ఏర్పాటు చేసుకోకుంటే మోటార్లు,స్టార్లర్లు కాలిపోకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు. అదే విధంగా ట్రాన్స్‌ఫార్మర్ల సంబంధిత విద్యుత్ లైన్లపై భారం పడకుండా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. విద్యుత్‌తో పాటు నీటి దుబారాను అరికట్టేందుకు ఆటో స్టార్లను తప్పనిసరిగా తొలగించడం ద్వారా విద్యుత్‌ను ఆదా చేసినట్లు అవుతుందని చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News