Saturday, November 23, 2024

విద్యుత్ సంస్థల సిఎండి సంతకం ఫోర్జరీ

- Advertisement -
- Advertisement -

ఏకంగా నియామక పత్రాలే సృష్టించిన కేటుగాళ్లు
మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభాకర్‌రావు సూచన

తప్పుడు ప్రచారంపై సిఎండి దేవులపల్లి ప్రభాకర్‌రావు

మన తెలంగాణ / హైదరాబాద్ : విద్యుత్‌శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే దళారుల మోసపూరిత మా ట లు నమ్మవదని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండి దేవుల పల్లి ప్ర భాకార్‌రావు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. తన పే రు చె ప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడమే కాకుండా తన సంతకాన్ని ఫోర్జరీ చేసి అపాయింట్ మెంట్ లెటర్ ఇస్తు న్న అంశం తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. తన సం తకం ఫోర్జరీ చేసి మణుగూరులో ఒక వ్యక్తి అపా యింట్ మెంట్ లెటర్ ఇచ్చినట్లు తెలిసిందన్నారు. విద్యుత్ సంస్థ ల్లో ప్రస్తుతం ఎలాంటి నోటిఫికేషన్లు లేవని తెలిపారు. నఖిలీ అపాయింట్ మెంట్ విజిలెన్స్ విచారుణ జరుగుతోందన్నారు.

ఎవరైనా ఉద్యోగాలు ఇపిస్తామని చెబితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, ఇటువంటి వ్యక్తుల ప ట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం లో కాని, ప్రభుత్వానికి చెందిన సంస్థల్లో కూడా ఉద్యోగా ల కోసం మొదట నోటిఫికేషన్ విడుదల అవుతుందని, అనంతరం ఆయా పోస్టులకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తామని, పరీక్షలు నిర్వహించిన అనంతర ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను ఇంటర్వూలకు చేసిన అనంతరం వారి అర్హతను బట్టి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుందన్నారు.ఉద్యోగాలు ఇపిస్తామనే మోసగాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒక వేళ ఎవరైనా తారసపడితే వెంటనే సంబంధిత అధికారులు లేదా. పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. దళారులు మాటలు నమ్మి డబ్బును,సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News