Friday, November 22, 2024

కోతల వద్దు… ఎండిపోవద్దు

- Advertisement -
- Advertisement -

అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలి డిమాండ్‌కు సరిపడా అందుబాటులో విద్యుత్ కరెంట్ పోయిందన్న ఫిర్యాదులు రాకూడదు సరఫరాలో సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించాలి. పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులకు
ఇబ్బందులు తలెత్తకూడదు. పంటలు ఎండిపోకుండా చూడాలి, తాగునీటి కొరత లేకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు,
సమస్యలు ఉన్నచోట తక్షణమే పరిష్కారం ఇందుకోసం జిల్లా స్థాయిలో సీనియర్ అధికారిని నియమించాలి
గ్రామాల వారీగా తాగునీటి సరఫరాకు కార్యాచరణ రూపొందించాలి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : కరెంటు కోత ఉండొద్దు, తాగునీటి కొరతను అధిగమించాలి, వేసవికి ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జా రీ చేశారు. రాష్ట్రంలో అంతరాయం లేకుండా వి ద్యుత్‌ను సరఫరా చేయాలని, తాగునీటికి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అ ధికారులను అప్రమత్తం చేశారు. ఎండాకాలం కా వటంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగిందని, అందుకు సరిపడా విద్యుత్‌ను అందించేందుకు స న్నద్ధంగా ఉండాలని సిఎం అధికారులకు సూచించారు. డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ను అందుబాటులో ఉందని, కరెంటు పోయిందన్న ఫిర్యాదు రా కుండా అప్రమత్తంగా ఉండాలని సిఎం ఆదేశాలిచ్చారు. తాగునీటి అవసరాలు, కరెంట్‌పోకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సిఎం రే వంత్‌రెడ్డి శనివారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ ఎక్కడైనా కరెంట్ సరఫరాలో సమస్య తలెత్తితో వెంటనే పరిష్కరించాలని సూచించా రు. రోజురోజుకు ఎండలు మండుతుండటం వి ద్యుత్ డిమాండ్ పెరుగుతుండటంతో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న విద్యుత్ లభ్యత, తక్షణ అవసరాల గురిం చి నిరంతరం అధికారులు సమీక్ష జరపాలని ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. గతేడాది కంటే రాష్ట్రంలో ఈ ఏడాది అత్యధికంగా విద్యుత్ ను సరఫరా చేసి కొత్త రికార్డును నమోదు చేసిందన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా మార్చిలో డిమాండ్ గణనీయంగా పెరిగిందని, పీక్ డిమాండ్ ఉన్నప్పటికీ కోత లేకుండా విద్యుత్‌ను అందించడంలో డిస్కంలు సమర్థవంతమైన పాత్ర పోషించాయని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కను సిఎం రేవంత్ అభినందించారు. గతేడాదితో పోలిస్తే డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ సరఫరా గణనీయంగా పెరిగిందన్నారు.

సగటున 9712 మెగావాట్ల విద్యుత్ లోడ్

రాష్ట్రంలో సగటున 9712 మెగావాట్ల విద్యుత్ లోడ్ ఉం టుందని, రెండు వారాలుగా 14,000 మెగా వాట్ల నుం చి 15,000 మెగావాట్ల పీక్ డిమాండ్ ఉంటోందని సిఎం తెలిపారు. ఏప్రిల్ నెల రెండో వారం వరకు ఇంచుమించుగా ఇదే స్థాయిలో డిమాండ్ ఉంటుందని, వేసవి అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసే కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా, పంటలు ఎండిపోకుండా, పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని సిఎం చెప్పారు. గతేడాది (2023) జనవరి నుంచి మార్చి వరకు సగటున రోజుకు 239.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా అయిందని, 2024 జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల్లో రోజుకు సగటున 251.59 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా జరిగిందన్నారు. గతేడాది మార్చి 14న 297.89 మిలియన్ యూనిట్లు సరఫరా అత్యధిక రికార్డు కాగా, ఈ ఏడాది 308.54 మిలియన్ యూనిట్లతో కొత్త రికార్డు నమోదయ్యిం దన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ గతేడాదితో పోలిస్తే విద్యుత్ సరఫరా మెరుగుపడిందన్నారు.

తాగునీటి కొరత లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలకు తాగునీటి కొరత లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏప్రిల్, మే, జూన్ వరకు స్థానికంగా ఉన్న నీటి వనరులను ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బోర్‌వెల్స్, బావులను తాగునీటి అవసరాలకు వాడుకోవాలని, సమీపంలో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని సిఎం రేవంత్ అధికారులకు సూచించారు. తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా జిల్లా కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆయన చెప్పారు. సమస్య ఉన్న చోట తక్షణ పరిష్కారాలను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ఒక సీనియర్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించాలని సిఎం ఆదేశించారు. వేసవి కోసం ప్రత్యేకంగా గ్రామాల వారీగా డ్రింకింగ్ వాటర్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలన్నారు.

అవసరాన్ని బట్టి రాష్ట్ర స్థాయి నుంచి సం బంధిత శాఖల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సిఎం రేవంత్ సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో తాగునీటి కొరతను అధిగమించేందుకు వాటర్ ట్యాంకులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ట్యాంకర్లు బుక్ చేస్తే ఆలస్యం లేకుండా 12 గంటల్లోపు అవసరమైన చోటికి చేరేలా చూడాలని, అందుకు సరిపడే ట్యాంకర్లు సమకూర్చుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News