Monday, December 23, 2024

గుజ’రాత్రి’.. వెలుగుల ‘తెలంగాణ’

- Advertisement -
- Advertisement -

Power cuts in Gujarat Uninterrupted Power in Telangana

ప్రధాని మోడీ స్వరాష్ట్రంలో వారానికి ఒకరోజు పరిశ్రమలకు పవర్ హాలీ

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కరెంటు కోతలు విధిస్తుండగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రా వు అన్ని కేటగిరీల వారికీ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేయిస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. గుజరాత్‌లో పరిశ్రమలకు వారానికి ఒక రోజు విద్యుత్తు హాలిడేగా ప్రకటిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం జాతీ య స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం ప్రభుత్వానికి ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వ్యవసాయానికి నిరంతరాయంగా 24 గంటలపాటూ విద్యుత్తును సరఫరా చేస్తుండటం, గృహ వినియోగానికి, పారిశ్రామికరంగాలకు కూడా నిరంతరంగా, ఎలాం టి కరెంటు కోతలు విధించకుండా విజయవంతంగా విద్యుత్తును సరఫరా చేయిస్తుండటం ప్రభుత్వ అధికారుల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. తెలంగాణలో విద్యుత్తు రంగం పనితీరు, గుజరాత్‌లోని విద్యుత్తు రంగం పనితీరులపై చర్చలు జరుగుతున్నాయి.

భారతీయ జనతా పార్టీ (బి.జె.పి)కి పాలించడం రాదు& అని ముఖ్యమంత్రి కె.సి.ఆర్. అనేక సందర్భాల్లో చేసిన విమర్శలకు గుజరాత్ రాష్ట్రంలోని కరెంటు కోతల దుస్థితి స్పష్టంచేస్తుందని అధికారవర్గాలే కాకుండా టీ.ఆర్.ఎస్.పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు సైతం విమర్శిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేయడమే కాకుండా కుల వృత్తులకు కూడా రాయితీలపై విద్యుత్తును సరఫరా చేస్తున్నారని ఆ పార్టీ నేతలు సగర్వంగా చెబుతున్నారు. అంతేగాక పరిశ్రమలు, గృహ వినియోగం, వ్యవసాయ రంగాలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తుండటంతోనే తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, కంపెనీలు తరలి వస్తున్నాయని అంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు, సంస్థలు ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి అనువైన, అనుకూలమైన రాష్ట్రంగా తెలంగాణను ఎన్నుకోవడానికి అనుకూలంగా ఉన్న వనరుల్లో అత్యంత ముఖ్యమైనది విద్యుత్తు సరఫరాయే కారణమని కూడా విద్యుత్తు శాఖకు చెందిన కొందరు సీనియర్ అధికారులు, పార్టీ నాయకులు సైతం సగర్వంగా చెబుతున్నారు.

గుజరాత్‌లో విపక్షాల విమర్శల హోరు

గుజరాత్‌లో వారానికి ఒకరోజు అక్కడి పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటిస్తూ అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పారిశ్రామిక వాడల్లో రోజుకో ప్రాంతంలో వారంరోజుల పాటు పవర్‌హాలీడే ఉంటుందని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. గుజరాత్ రాష్ట్రం అన్నిరంగాల్లో ముందుందని చెప్పుకునే ప్రధాని మోదీ తన సొంత రాష్ట్రంలో ప్రజలకు, పరిశ్రమలకు కనీసం 9 గంటల విద్యుత్‌ను అక్కడి ప్రభుత్వం అందించలేక పోతుందని అక్కడి ప్రతిపక్షాలు సైతం ఆరోపిస్తున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే దిగువ మధ్యతరగతి గృహ వినియోగదారులకు 50 యూనిట్ల లోపు విద్యుత్‌ను వినియోగించుకుంటున్న వారి నుంచి తెలంగాణలో కేవలం రూ.1.45 పైసలు వసూలు చేస్తుండగా ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో అదే 50 యూనిట్లలోపు వినియోగించుకునే వారి నుంచి రూ.3.30 పైసలను అక్కడి ప్రభుత్వం వసూలు చేస్తోంది.

200 యూనిట్ల విద్యుత్‌ను వాడుకునే వారి నుంచి రూ.1,285లు

రాష్ట్రంలో కుల, మతాలకు అతీతంగా 200 యూనిట్ల విద్యుత్‌లోపు వాడుతున్న వినియోగదారులకు సబ్సిడీలను అందించడంతో పాటు కేవలం నెలకు 200 యూనిట్లు వినియోగిస్తున్న వారి నుంచి 822 రూపాయలను తెలంగాణ డిస్కంలు వసూలు చేస్తుండగా గుజరాత్‌లో మాత్రం రూ.1,285లు ప్రజల నుంచి ముక్కుపిండి అక్కడి ప్రభుత్వం వసూలు చేస్తోంది. వ్యవసాయ రంగానికి అందిస్తున్న విద్యుత్‌కు సైతం తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాలన్నీ నెలవారీ బిల్లులు వసూలు చేస్తూ 24 గంటల విద్యుత్ సరఫరా ఎక్కడా ఇవ్వడం లేదు. దీనికి ప్రధాని మోదీ రాష్ట్రమైన గుజరాత్ కూడా అతీతంగా కాదు. గుజరాత్‌లో రైతుల నుంచి డబ్బులు వసూలు చేయడంతో పాటు వారికి కేవలం 9 గంటలే విద్యుత్ సరఫరా చేస్తుందని, అది కూడా కోతల సరఫరానేనని అక్కడి ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీంతోపాటు 9 గంటల విద్యుత్‌ను వినియోగించుకుం టున్న ఒక్కో రైతు నుంచి ఒక్కో మోటారు కనెక్షన్ నుంచి నెలకు 667 రూపాయలను గుజరాత్ ప్రభుత్వం వసూలు చేస్తోందని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News