Monday, December 23, 2024

విద్యుత్ వినియోగంలో రికార్డు..

- Advertisement -
- Advertisement -

కరెంటు @ 14794 మెగావాట్లు
మరోసారి రికార్డు విద్యుత్ వినియోగం
మంగళవారం అధిక డిమాండ్
ఇప్పటికే వ్యవసాయానికి 37 శాతం వినియోగం
వేసవి నేపథ్యంలో గృహావసరాలకు పెరుగనున్న కరెంట్
హైదరాబాద్: రాష్ట్ర చరిత్రలో మరోసారి అధిక విద్యుత్ వినియోగం నమోదైంది. మంగళవారం 14794 మెగావాట్ల అధిక విద్యుత్ డిమాండ్ నమోదయ్యింది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ విస్తీర్ణం భారీగా పెరిగింది. దీంతో వ్యవసాయానికి 37 శాతం విద్యుత్ వినియోగం నమోదవుతోంది. పంటల సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలు పెరగుతుండడంతో విద్యుత్ అవసరం పెరుగుతోందని ఆ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలోనే గృహావసరాలకు సైతం విద్యుత్ డిమాండ్ పెరుగుతుండడంతో దానికి తగ్గట్టుగానే ఆ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. విద్యుత్ వినియోగంలో చూసుకుంటే దక్షిణ భారతదేశంలో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో తెలంగాణ నిలిచింది. మంగళవారం 14,794 మెగావాట్లు విద్యుత్ డిమాండ్ నమోదు కాగా గత సంవత్సరం ఇదే రోజున గరిష్ట విద్యుత్ డిమాండ్ కేవలం 12,996 మెగావాట్లు మాత్రమే. గత సంవత్సరం మార్చి నెలలో 14,160 మెగా వాట్ల అత్యధిక విద్యుత్ వినియోగం నమోదు కాగా ఈ సారి డిసెంబర్ నెలలోనే గత మార్చి రికార్డును అధిగమించి 14,501 మెగావాట్లుగా నమోదయ్యింది.

డిమాండ్ ఎంత వచ్చినా నిరంతర విద్యుత్ ఇస్తాం: ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి ప్రభాకర్ రావు
విద్యుత్ డిమాండ్ ఎంత ఉన్నా 24 గంటల నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తామని ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు తెలిపారు. తెలంగాణలో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో సరాసరి వ్యవసాయానికే 37 శాతం విద్యుత్ వినియోగం అవుతోందన్నారు. ఎండా కాలం నేపథ్యంలో మార్చి, ఏప్రిల్ , మే నెలల్లో అటు గృహ విద్యుత్‌ను కూడా వినియోగదారులు ఎక్కువగా వాడతారని, అందుకు అనుగుణంగా కోతలు లేకుండా నిరంతరం కరెంట్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభాకర్ రావు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News