Tuesday, December 24, 2024

వాణిజ్య, వ్యాపార సంస్థల్లో భద్రతపై దృష్టి సారించని విద్యుత్ శాఖ అధికారులు

- Advertisement -
- Advertisement -

తరుచు జరిగే ప్రమాదాల్లో జరిగే నష్టపోతున్న ప్రజలు

Power department official do not focus on safety

మన తెలంగాణ, సిటీబ్యూరో: నగరం రోజు రోజకు అభివృద్ది చెందుతోంది. అనేక జాతీయ ,అంతర్జాతీయ పరిశ్రమలు నెలకొంటున్నాయి. వాటితో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక వాణిజ్య,వ్యాపార సంస్థలతో పాటు,ఆసుపత్రులు, ఇతర సౌకర్యాలు కూడా అభివృద్ది చెందుతున్నాయి. అయితే వాటి నిర్మాణ సమయంలో సంబంధిత నిర్వాహకులు తీసుకోవాల్సిన విద్యుత్ సంబంధిత అనుమతులను పట్టించు కోవడం లేదు.

అదే విధంగా అధికారులు కూడా ఆయా భవనాలకు అనుమతులు ఉన్నాయా లేదా ఉంటే సదరు సంస్థలు విద్యుత్ భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా అనే అంశాన్ని పట్టించు కోవడం లేదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ప్రమాదాలు జరిగిన తర్వాత అధికారులు చేస్తున్న హాడావిడి అంతాఇంత కాదు. సదరు సంస్థల్లో ఉండే డిమాండ్‌కు సంబంధించిన మేర విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయక పోవడంతో ఓవర్ లోడ్‌కు గురై షార్ట్ సర్యూట్‌కు గురవుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణగా ప్రజలు ధన,ప్రాణ రక్షన కల్పించాల్సిన అగ్నిమాపక, సీఈఐటి అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్ముక్కయి నిరభ్యంతర దృవపత్రాతల జారీ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

సాధారణంగా 75 కేవీఏ సామర్థం అంతకంటే ఎక్కువ లోడు ఉన్న వ్యాపార, వాణిజ్య పరిశ్రమలు, ఐటీ, స్టార్ హోటళ్ళు, ఆసుపత్రులు,పరిశ్రమలు, విద్యుత్ తనిఖీ అధికారుల పరిధిలోకి వస్తాయి. భవన నిర్మాణ సమయంలో సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి తనఖీలు నిర్వహించాలి, డిమాండ్ మేరకు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు జరిగిందా, బేకర్స్, ప్యూజ్ బాక్స్‌లు సరిగా ఉన్నాయా, వాటి పనితీరు ఎలా ఉంది. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులను నియంత్రించేందుకు ఏమైనా ఏర్పాట్లు చేశారా, డిమాండ్ మేరకు లైనింగ్ ఏర్పాటు చేశారా, వాటి సామర్థం ఎంత, వైర్లు స్విచ్చుబోర్డుల నాణ్యత, ఐఎస్‌ఐ గుర్తింపు, విద్యుత్ కేబుళ్ళను కపాడేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారు.

ఒక వేళ అనుకోకుండా విద్యుత్ ప్రమాదాలు ఏర్పడితే వాటిన నియంత్రించే వ్యవస్థ ఉందా లేదా తదితర అంశాలన్నింటిని పూర్తిగా పరిశీలించి అన్ని ఉన్నాయనుకుంటే నిరభ్యంతర దృవపత్రాలను జారీ చేయాలి. కాని ఇటువంటి ఏమీ జరకుండా తనిఖీలకు కోసం వచ్చిన అధికారులను సంబందిత నిర్వాహకులను వ్యక్తిగతంగా కలవగానే అప్పటి వరకు తప్పుగా ఉన్నఅంశాలు, ఓప్పుగా మారితపోతున్నాయనే ఆరోపణలు సైతం వస్తున్నాయి.దీంతో నగరంలోని వర్తక ,వాణిజ్య సంస్థలో జరిగే ప్రమాదాలకు , భవనాలు నిర్వహకులు, సంబంధిత అధికారులు పరోక్షంగా కారణం అవుతున్నారు. ఇకనైనా అధికారులు ఆయా భవనాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం ద్వారా జరగనున్న ప్రమాదాలను నివారించ వచ్చచని తద్వారా జరిగే ధన ప్రాణ నష్టం నుంచి ప్రజలను కాపాడవచ్చనేఅభిప్రాయం వ్యక్తం అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News