Wednesday, January 22, 2025

తెలంగాణ నుంచి ఆ బకాయిలు ఎపికే చెల్లిస్తాం: ఆర్‌కె సింగ్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలను ఆర్‌బిఐ ద్వారా ఇప్పిస్తామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కె సింగ్ తెలిపారు. రాజ్యసభలో ఎంపి విజయసాయిరెడ్డి ఎపికి తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు రావడంలేదని ప్రశ్నలు అడగడంతో ఆర్ కె సింగ్ సమాధానం చెప్పారు. ఆరు వేల కోట్లకు పైగా ఉన్న విద్యుత్ బకాయిలను తెలంగాణ నుంచి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నామని వివరణ ఇచ్చారు. ఈ అంశంపై కేంద్రం న్యాయ శాఖ, ఆర్థిక శాఖలతో చర్చలు జరుపుతున్నామన్నారు. ఆర్‌బిఐలో తెలంగాణ ప్రభుత్వ ఖాతా నుంచి బకాయిలు మొత్తాన్ని చెల్లింపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆర్ కె సింగ్ స్పష్టం చేశారు.

Also Read: చెప్పుతో చెంపలు వాయించుకున్న కౌన్సిలర్(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News