Monday, December 23, 2024

బిజెపి రాష్ట్రాల్లో… పవర్ హాలిడే..!!

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో నిరంతం 24 గంటల విద్యుత్ సరఫరా
పొరుగు రాష్ట్రం ఆంధ్రాలోనూ కొనసాగుతున్న కోతలు
రాష్ట్రంలో విడిపోతే తెలంగాణ అంధకారంలో ఉంటుందన్న నేతలకు ధీటుగా జవాబు

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గృహ విద్యుత్, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తుండగా, బిజెపి నేతలు గొప్పలు చెప్పుకునే డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ‘ పవర్ హాలిడేలు’ అమలులోకి రావడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అ య్యింది. బిజెపి పాలనలోఉన్న గుజరాత్ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ ప్రభుత్వం ఉంటే అభివృద్ధి పరుగులు పెడుతుందని బిజెపి నేతలు చేసుకున్న ప్రచారంలో ఏ మాత్రం పస లేదని గుజరాత్ రాష్ట్రంలో అమలు అవుతున్న పవర్ హాలిడేలు నిరూపించాయి. గుజరాత్ రాష్ట్రంతో పాటు మనకు పొరుగున్న ఆంధప్రదేశ్‌లోనూ కిందటి ఏడాది మార్చిలో పవర్ హాలిడే మాదిరే ఈ సంవత్సరంలోనూ పవర్ హాలిడేలు అమలు అవుతున్నట్లు తెలిసింది. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ అంధకారంలో ఉంటుందని, ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని బీరాలు పలికిన కొందరు సీమాంధ్ర మేధావుల ప్రకటనలు తాజాగా ఏపిలో అమలు అవుతున్న పవర్ హాలిడేలు ఎద్దేవా చేశాయి. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తుంది అని చెప్పడానికి తెలంగాణ వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్న వైనమే నిలువెత్తు నిదర్శనం.

కోతల గుజరాత్‌పై విపక్షాల మండిపాటు :

ఒక వైపు తెలంగాణలో 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అవుతుంటే బిజెపి పాలిత గుజరాత్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు అమలు అవుతున్నాయి. వారానికి ఒక రోజు పూర్తిగా పరిశ్రమలకు కరెంట్ కట్‌లను అమలు చేస్తోంది. గుజరాత్ ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ సంస్థ ఈ మేరకు ఇటీవల విద్యుత్‌కోతలపై ఉత్తర్వును కూడా విడుదల చేసినట్లు చెబుతున్నారు. ఈ కోతలు ప్రస్తుతం పరిశ్రమలకే పరిమితం చేసినట్లు చెబుతోంది. గుజరాత్‌లో పరిశ్రమలతో పాటు, వ్యవసాయ రంగం గత కొన్ని వారాలుగా 6 గంటల పాటు విద్యుత్ కోతలను ఎదుర్కొంటోందని గుజరాత్ అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ సభ్యులు లేవనెత్తుతూ వచ్చారు. ఈ క్రమంలో గుజరాత్ ప్రభుత్వం లిఖిత పూర్వక సమాధానం చెబుతూ .. 500 మెగావాట్ల కంటే ఎక్కువ విద్యుత్ సరఫరా అవుతున్న కొన్ని పరిశ్రమల నుండి విద్యుత్ కొరతను తగ్గించే ప్రయత్నంలోనే గుజరాత్ ప్రభుత్వం పరిశ్రమలపై విద్యుత్ కోతను విధించిందని తెలిపింది. అది కూడా వారంలో ఒక రోజు మాత్రమే కోత విధించాలని ఆదేశించినట్లు తెలిపింది. అయితే ఇందుకు విరుద్దంగా ఆ రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా కోతలు అమలు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇటు మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా తరుచూ పవర్ హాలిడేలను అమలు చేస్తూ వస్తోంది.

ఏపిలోనూ పక్షం రోజుల కోతలు !!

కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలకు పవర్ హాలిడే ఇస్తూ ఏపి ట్రాన్స్‌కో తరుచూ ప్రకటనలను జారీ చేస్తోంది. ఒక సారి రెండు రోజులు మరో సారి పక్షం రోజులు ఇలా కోతల తరుచూ విధిస్తూనే ఉంది. నిరంతరాయంగా పని చేసే పరిశ్రమలకు 50 శాతం లోడ్ రిలీఫ్‌తో పాటు ఇతర పరిశ్రమలు 15 రోజుల పాటు పగటిపూట మాత్రమే విద్యుత్ వినియోగించుకోవాలని సూచిస్తోంది. క్షేత్రస్థాయిలో మూడు డిస్కంలు లోడ్ రిలీప్ పేరిట కోతలు అమలు చేస్తాయని తేల్చి చెబుతోంది. వ్యవసాయం, గృహ వినియోగానికి విద్యుత్ ఇవ్వాల్సి ఉన్నందున పరిశ్రమలకు కోత తప్పడం లేదని ఇటీవలే వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయంలో రెండు రోజుల పాటు పవర్ హాలిడేను అమలు చేసింది. ఏసిలోని మూడు విద్యుత్ సంస్థలు ఈ మేరకు నిర్ణయం తీసుకుని అమలు చేశాయి కూడా. నిరంతరం పని చేసే వాటికి 50 శాతం మేర లోడ్ రిలీఫ్ విధిస్తున్నట్లు ప్రకటనలు జారీ చేశాయి. మిగతా పరిశ్రమలకు 15 రోజులు మాత్రమే విద్యుత్‌ను అది కూడా పగటిపూట మాత్రమే విద్యుత్‌ను వినియోగించుకోవాలని తేల్చి చెప్పాయి.

రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ దిగి వచ్చేంత వరకు ప్రస్తుతం అమలులో ఉన్న ఈ కోతలు కొనసాగుతాయంటూ తేల్చి చెప్పింది. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ అందించాల్సి ఉన్నందున పరిశ్రమలకు 50 శాతం మేర కోత విధిస్తున్నట్లు ట్రాన్స్‌కో తెలిపింది. వ్యవసాయంతో పాటు గృహ వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేయాల్సి ఉన్నందున పరిశ్రమలకు లోడ్ రిలీఫ్ ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. వచ్చే 15 రోజుల్లో దేశ వ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ దిగి వస్తుందని, అప్పుడు సరఫరా మెరుగయ్యే అవకాశం ఉందని ట్రాన్స్‌కో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం డిమాండ్‌ను అనుసరించి రోజూ 50 నుంచి 50 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉన్నట్లు తెలియజేసింది. విద్యుత్ ఎక్సేంజీల్లోనూ అంత పెద్ద మొత్తంలో విద్యుత్ అందుబాటులో లేదని అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో కోతలు విధించాల్సి వస్తోందని తెలిపింది. ఏపిలోనే కాదు, ప్రధాని స్వరాష్ట్రం గుజరాత్‌లోనూ కోతలు విధిస్తున్నారని చెప్పడం గమనార్హం. గత ఏడాది మార్చి తొలి వారంలో ఏపిలో 235 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉందన్న ట్రాన్స్‌కో పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ఏపిలోని జెన్‌కో ప్లాంట్ల నుంచి విద్యుత్ ఉత్పిత్తతో పాటు బహిరంగ మార్కెట్ నుంచి 64 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించింది.

అలాగే మాల్స్, వాణిజ్య సంస్థల వినియోగదారులు ఏసిల వినియోగాన్ని సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6.00 గంటల వరకు తగ్గించాలని ఆదేశించింది. విద్యార్థులకు పరీక్షలు ఉన్నందున అందుబాటులో ఉన్న విద్యుత్‌ను నియంత్రించటం మినహా తమకు మరో ప్రత్యామ్నాయం లేదని తెలిపింది. పవర్ ఎక్సేంజీల నుండి పవర్‌ను అధిక ధరలకు కొనుగోలు చేద్దామని భావించినా విద్యుత్ అందుబాటులో లేదని సిపిడిసిఎల్ సంస్థ వెల్లడించడం గమనార్హం. ఏప్రిల్ 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు పరిశ్రమలకు 50 శాతం మేర లోడ్ రిలీఫ్ ఇస్తున్నట్లు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో 50 శాతం మాత్రమే ఏసిలను వినియోగించాలని సూచించింది. బోరు బావుల్లో నీరు సమృద్ధిగా ఉండడంతో వ్యవసాయ విద్యుత్ వినియోగం 15 శాతం, వేసవి తీవ్రతతో గృహ వినియోగం 50 శాతం పెరిగిందని చెబుతుండడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News