Wednesday, January 22, 2025

కాంగ్రెస్ హయాంలో పటాన్ చెరులో పవర్ హాలీడే

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: పటాన్ చెరు కార్మికులకు ఇక్కడే వైద్య చికిత్స అందుతుందని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. పటాన్ చెరు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి హాజరైన మంత్రి హరీశ్ రావు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ…. ఏడాదిలోగా ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. గతంలో ఏదైనా అయితే గాంధీ, ఉస్మానియాకో వెళ్లాల్సి వచ్చేదన్నారు. ఎవరికి ఏం కావాలో తెలిసిన నాయకుడు.. మన కెసిఆర్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో పటాన్ చెరులో పవర్ హాలీడే ఉండేది.. వారానికి రెండ్రోజులు కరెంట్ ఉండేది కాదని ఆరోపించారు. మా ప్రభుత్వం వచ్చాక పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని మంత్రి హరీశ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News