Tuesday, January 21, 2025

బిఎస్పీతోనే పేదలకు అధికారం సాధ్యం

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ సీతానగర్ ఎంపీటీసీ పార్టీలో చేరిక : ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్

హైదరాబాద్ : సమాజంలోని పేద వర్గాలకు రాజ్యాధికారం దక్కాలంటే బిఎస్పీ అధికారంలోకి రావాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా శుక్రవారం ఈజ్ గాం బెంగాలీ క్యాంపులో పర్యటించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పేద వర్గాలకు నిజమైన అభివృద్ధి ఫలాలు దక్కాలంటే రాష్ట్రంలో బిఎస్పీతో సాధ్యమని కేంద్రంలో దోపిడీ పాలన సాగిస్తూ,వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా బెంగాలీ ప్రజల ఓట్లతో గద్దెనెక్కుతున్న పాలకులు వారి సమస్యలను పట్టించుకోలేదన్నారు.

బెంగాలీ క్యాంపుల్లో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసం మాత్రమే అధికార పార్టీ నేతలు బెంగాలీ కాలనీలో తిరుగుతారని, ఎన్నికల తర్వాత ప్రజలను మర్చిపోతారన్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ది చెప్పాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం సీతానగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ చునార్కర్ జమున మహేష్ బిఎస్పీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి అర్షద్ హుస్సేన్,రాష్ట్ర కార్యదర్శి సిడెం గణపతి,రాష్ట్ర అధికార ప్రతినిధి జక్కని సంజయ్,జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రవీణ్, జిల్లా కోశాధికారి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News