- Advertisement -
హైదరాబాద్: బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘గని’. బుధవారం వరుణ్ పుట్టిన రోజు సందర్భంగా మెగా అభిమానులకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు మేకర్స్. ‘పవర్ ఆఫ్ గని’ పేరుతో చిన్న టీజర్ ను విడుదల చేశారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ సరసన బాలీవుడ్ యంగ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు బాబి, సిద్దు ముద్ద కలిసి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.కాగా, ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ మూవీ మళ్లీ కరోనా విజృంభిస్తుండడంతో వాయిదా పడింది.
Power of Ghani Teaser Released
- Advertisement -