Monday, January 20, 2025

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఆందోళన చెందుతున్న రైతులు

- Advertisement -
- Advertisement -

అధికారులు స్పందించి విద్యుత్ స్థంభం మార్చాలని విజ్ఞప్తి


మనతెలంగాణ/మనోహరాబాద్‌:  కొండాపూర్ గ్రామంలో ఓ రైతు పొలం ఇంటిపక్కనే ఉన్న విద్యుత్ స్థంభం ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. విద్యుత్ స్థంభం దెబ్బతిని ఒకవైపు కేవలం కరెంట్ తీగల ఆధారంగా ఉంది దాని కారణంగా కరెంట్ వైర్లు కూడా దాదాపు తెగిపడే స్థాయికి వచ్చాయి. దీంతో పక్కనే ఇల్లు ఉండటంతో రైతులు భయందోళనలకు గురి అవుతున్నారు. పెద్ద లైన్ 11 కెవి విద్యుత్ స్థంభం ఇలా ప్రమాకరమైన స్థితిలో ఉందని ఇప్పటికే విద్యుత్ అధికారులకు గ్రామ సర్పంచ్ మమత రవి, రైతులు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మత్తులు చేపట్టాలని వారు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News