- Advertisement -
ముషీరాబాద్: ఆజామాబాద్ డివిజన్ పరిధిలో వివిధ మరమ్మతు పనులు కారణంగా పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్ సరఫరా ఉండదని సిబిడి ఏడీఈ ఎం. విజయ్ భాస్కర్ తెలిపారు. ఈ మేరకు బతుకమ్మ కుంట సబ్ స్టేషన్ బతుకమ్మ కుంట ఫీడర్ పరిధిలో పాముల బస్తీ, మల్లన్న టెంపుల్, గంగా నగర్, పోచమ్మ బస్తీ, బతుకమ్మ కుంట తదితర ప్రాంతాలలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ విద్యుత్ సరఫరా ఉండదన్నారు. ఉస్మానియా యూని వర్శిటీ సబ్ స్టేషన్ బౌద్ద నగర్ ఫీడర్ పరిధిలో అమీనా షాప్, కెనరా బ్యాంక్ గల్లీ తదితర ప్రాంతాలలో ఉదయం గం. 9.30 నుంచి గం. 11.30 వరకూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు. ఈ విషయాలను వినియోగదారులు, ప్రజలు గమనించాలని ఆయన కోరారు.
- Advertisement -