Monday, November 18, 2024

భారీ వర్షానికి నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు

- Advertisement -
- Advertisement -

వేంసూరు : మండల కేంద్రమైన వేంసూరు గ్రామపంచాయతీలో ఆదివారం సాయంత్రం భారీ వర్షంతో పాటు ఈదురు గాలులకు కమ్మ వారి వీధిలో నాలుగు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మహా వృక్షాలు కూలిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గాఢాంధకారం అలుముకుంది. వెంటనే అప్రమత్తమైన విద్యుత్ శాఖ లైన్మెన్ లక్ష్మీనారాయణ తన సిబ్బందితో విద్యుత్ సరఫరా అందించేందుకుకసరత్తు ప్రారంభించారు.

సెల్ ఫోన్ ల టార్చిలైట్ల సహాయంతో, విద్యుత్తును పునరుద్ధరణ చేసి, గ్రామపంచాయతీలో విద్యుత్ను అందించి నెలకొని ఉన్న అంధకారాన్ని తొలగించి వెలుగును ప్రసాదించటంతో, వృద్ధులు పిల్లలు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. వేసవి తాపానికి అల్లాడిన ప్రజానీకం ఒక్కసారిగా అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి, చల్లటి వాతావరణానికికొంత ఉపశమనం పొందారు.రైతన్నలకుకురిసిన వర్షానికి ఆనందంతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. వరి విత్తనాలు చల్లే కార్యక్రమంలో ఉన్నారు. మరి కొంతమంది రైతులు వరి విత్తనాల కోసం సొసైటీ కార్యాలయాలు వెళ్లి తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News