- Advertisement -
నైరోబీ : కెన్యాలో 14 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శుక్రవారం రాత్రంతా ప్రజలు అంధకారంలో గడిపారు. రాజధాని నైరోబీలోని జోమా కెన్యట్టా అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలు కూడా గంటల తరబడి నిలిపోయాయి. ఆస్పత్రులు, ఆఫీస్‌లు, దేశాధ్యక్ష కార్యాలయ ప్రాంగణానికి కూడా విద్యుత్ సరఫరా కాలేదు. దీనికి కారణాలేమిటో ప్రభుత్వం వెల్లడించలేదు. చివరకు శనివారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో రాజధానిలోని చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. విమానాశ్రయంలో జనరేటర్ ఉన్నప్పటికీ సమయానికి అది పనిచేయలేదని కెన్యా ఎయిర్ పోర్ట్ అథారిటీ తెలియజేసింది. ఈ అంతరాయానికి చింతిస్తున్నట్టు రవాణా మంత్రి కిప్‌చుంబా ముర్కోమెన్ తెలిపారు.
- Advertisement -